»   » షాక్: అనుష్క తొడల గురించి అలీ నీచమైన కామెంట్

షాక్: అనుష్క తొడల గురించి అలీ నీచమైన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆడియో ఫంక్షన్లలో హీరోయిన్ల గురించి, వారి అందం గురించి కెమెడియన్ అలీ బూతును తలపించేలా డబుల్ మీనింగ్ కామెంట్స్ చేయడం, వివాదాల్లో ఇరుక్కోవడం తెలిసిందే. గతంలో హీరోయిన్ సమంత గురించి నడుము గురించి మాట్లాడుతూ బెంజి సర్కిల్ గా ఉంటుంది అంటూ కామెంట్ చేసిన అలీ విమర్శలు ఎదుర్కొన్నాడు.

తాజాగా సైజ్ జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడలు గురించి మరోసారి వివాదాస్పద కామెంట్ చేసాడు అలీ. ఈ ఆడియో వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించింది. ఈ వేదికపై సొనాల్ చౌహాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఆమె నడుము గురించి సుమ ప్రస్తావించింది. ఆ వెంటనే.. అలీ.. సొనాల్ నడుము గురించి కాదు.. అనుష్క తొడ గురించి మాట్లాడితే బాగుంటుందనీ, 'బిల్లా' సినిమాలో అనుష్క తొడ చూసినప్పట్నుంచీ ఆమె తొడకు నేను అభిమానిని అయ్యాననీ అంటూ వ్యాఖ్యానించాడు.

Ali controversial comments on Anushka Thighs!

అలీ కామెంట్స్ విని వేదికపై ఉన్న సినీ ప్రముఖులంతా విస్తు పోయారు. అలీ మరీ ఇలా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడనే విమర్శలు సైతం వినిపించాయి. సినిమాలో ఎవరైనా హీరోయిన్ అందాల ఆరబోత చేసిందంటే... అది స్క్రిప్టులో భాగమే. జస్ట్ ఫర్ ఎంటర్టెన్మెంట్. కానీ అవే విషయాలు నిజజీవితంలోకి అనునయించి, హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఇలా పబ్లిక్ వేడుకల్లో నీచంగా మాట్లాడటం సంస్కార హీనమే అనే వాదన వినిపిస్తోంది.

Ali controversial comments on Anushka Thighs!

సైజ్ జీరో సినిమా విసయానికొస్తే..
అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం,బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

English summary
Comedian Ali Controversial Comments on Anushka Thighs at Size Zero Launch.
Please Wait while comments are loading...