యాంకర్ అనసూయపై కూడా అలీ డబుల్ మీనింగ్ కామెంట్స్!
హైదరాబాద్: నందమూరి బాలయ్య హీరోగా సత్య దేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లయన్' ఆడియో వేడుక గురువారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా సాగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆవిష్కరించారు.
ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి కమెడియన్ అలీ, యాంకర్ అనసూయ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆడియో వేడుక సందర్భంగా అనసూయను ఉద్దేశించి అలీ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. అనసూయ వాడుతున్న మైకులో బ్యాటరీ వీక్ అయిందంటూ ద్వందార్థాలు వచ్చేలా కామెంట్ చేసాడు అలీ.

ఒక్క ఈ ఆడియో వేడుకలో మాత్రమే కాదు...ఇటీవల కాలంలో అలీ ఇలాంటి చేష్టలతో వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుకలో కూడా అలీ ఇలాంటి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేసి యాంకర్ సుమను ఇరిటేట్ చేసాడు.
తర్వత విజయవాడలో జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో సక్సెస్ మీట్లో కూడా సమంత నాభి భాగాన్ని బెంజి సర్కిల్ తో పోలుస్తూ సమంత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.


Click it and Unblock the Notifications











