వైరల్ అవుతున్న సుమ, అలీ సంభాషణ.. రాజీవ్ కనకాలని లాగాడు!
కమెడియన్ అలీ ఎక్కడ ఉన్నా కామెడీ పంచులు పేలాల్సిందే. కొన్నిసార్లు అలీ చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి, వివాదంగా కూడా మారుతుంటాయి. అలీ సరదాగా కోసమే స్టేజిపై వ్యాఖ్యలు చేస్తాడు. కానీ ఆ వ్యాఖ్యలు అదుపు తప్పి కాంట్రవర్సీగా మారుతుంటాయి. గతంలో అనుష్క, సమంతపై అలీ చేసిన కామెంట్స్ ఇలాగే వివాదం సృష్టించాయి. ఇదిలా ఉండగా యూట్యూబ్ సెన్సేషన్ ప్రియవారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ చిత్రం తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సుమ, అలీ యాంకర్స్ గా మారారు. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

సుమ, అలీ ఉంటే
సుమ, అలీ గతంలో చాలా వేడుకలకు యాంకర్స్ గా చేశారు. సుమ, అలీ కాంబినేషన్ ఉంటే ఆడియన్స్ కు నవ్వులే. ఈవెంట్ మొత్తం అలీ కామెడీ పంచులతో అలరిస్తుంటాడు. వీరిద్దరూ కలసి చేసిన కామెడీ స్పూప్ వీడియోలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

బన్నీ గురించి
అలీ ఈ ఆడియో వేడుకలో ప్రియా వారియర్ తో బన్నీ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. రుద్రమ దేవి చిత్రం చూశావా అని అలీ ప్రియా వారియర్ ని అడిగాడు. చూశాను అంటూ బదులిచ్చింది. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా.. ఈడా ఉంటా అనే డైలాగ్ ని అలీ ప్రియవారియర్ తో మలయాళంలో చెప్పించాడు. ఈ దృశ్యం మొత్తం చాలా సరదాగా సాగింది.

రోషన్ నీ కొడుకా
సుమ మాట్లాడుతూ.. ప్రియ వారియర్ అలికి చెల్లి అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అలీ ఊరుకుంటాడా.. వెంటనే స్పందిస్తూ..సుమ కొడుకు పేరు కూడా రోషనే. అంటే ఈ రోషన్ నీ కొడుకు లాంటివాడా అని సుమని అడిగాడు. అవును నా కొడుకు లాంటివాడే.. ఇప్పుడేంటి అని బదులిచ్చింది. అదే రాజీవి కానుకల ఎప్పుడు కేరళా వెళ్లాడా అని అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టాడు. అక్కడున్న అల్లు అర్జున్, మిగిలిన వాళ్ళందరూ పగలబడి నవ్వారు. సుమ స్పందిస్తూ మీ నోట్లో నోరు పెట్టాను చూడండి.. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్
అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. లవర్స్ డే ఆడియో వేడుకలో అల్లు అర్జున్, ప్రియ వారియర్ ఆకర్షణగా నిలిచారు. ఈ ఆడియో వేడుకలో ప్రియ వారియర్ ఒరు ఆధార్ లవ్ చిత్రంలో లాగ బన్నీకి గురి పెట్టింది. ఈ వీడియో కూడా నెటిజన్లని ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











