గబ్బర్ సింగ్‌తో కలిసి నవ్వించేది అతడేనా?

ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిది. మిగతా భాగాన్ని త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ 27న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న విషయం తెలిసిందే. మే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా....భద్ర, తులసి, సింహా లాంటి విజయవంతం అయిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











