హీరో రామ్ చరణ్ చుట్టూ తిరిగే కథ (అలి 'తిమ్మరాజు' ప్రివ్యూ)

By Srikanya

యమలీల చిత్రంతో హీరోగా పరిచయమైన అలీ ఆ తర్వాత ఎన్ని చిత్రాల్లో హీరోగా చేసినా ఆ రేంజి హిట్టివ్వలేకపోయాడు.తాజాగా అలి 'తిమ్మరాజు'అనే చిత్రంతో వస్తున్నాడు. ఈరోజు(శుక్రవారం)విడుదల అవుతున్న ఈ చిత్రంలో అతను తిమ్మరాజు అనే టైటిలో రోల్ ని చేస్తున్నాడు.కథ ప్రకారం..తిమ్మరాజు..కళ్లకు గంతలు కట్టుకొని కత్తితో విన్యాసాలు చేస్తుంటాడు .ఆ విద్యే ఆయనకు జీవనాధారం.చిత్రవిచిత్ర విన్యాసాలతో నలుగుర్ని నవ్విస్తూ గడిపే తిమ్మరాజుకి ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. అది పరిష్కారం కావాలంటే బోలెడంత డబ్బు అవసరం. ఇంతలో మరో సమస్యతో బాధపడుతున్న ఓ జంట తిమ్మరాజుకి జత కలిసింది.వీళ్లంతా కలిసి తమ సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నారు? అసలు తిమ్మరాజు సమస్యేమిటనే విషయాల్ని తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రంతో దర్సకుడుగా రచయితగా పలుచిత్రాలుకు పనిచేసిన వేమగిరి పరిచయమవుతున్నాడు. అతను మాట్లాడుతూ.. తిమ్మరాజు సమస్య పరిష్కారం కావడంలో హీరో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తారు.అదెలాగన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు. ముఖ్యంగా అలీ గెటప్పులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు.

తిమ్మరాజు
సంస్థ: శ్రీ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: అలీ, చిన్నా, దీప్తి, వేణు, సుమన్‌శెట్టి, ధన్‌రాజ్‌, ఎల్బీ శ్రీరామ్‌, ఎమ్మెస్‌ నారాయణ, కొండవలస, మెల్కొటే తదితరులు
నిర్మాత: పులిరాజు, కె.ఎస్‌.ఎస్‌.కుమార్‌.
దర్శకత్వం: వేమగిరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X