»   » బెజవాడలో అలీ, జీవితాంతం ఇలానే అంటూ ప్రకటన

బెజవాడలో అలీ, జీవితాంతం ఇలానే అంటూ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జంద్యాల పురస్కారం తన బాధ్యత మరింత పెంచిందని, జీవితాంతం తాను హాస్యనటుడిగానే కొనసాగుతానని ప్రముఖ హాస్య నటుడు అలీ అన్నారు. సుమధుర కళానికేతన్ 42వ వార్షికోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న 20వ తెలుగు హాస్యనాటికల పోటీలు ముగింపు వేడుకలో పాల్గొన్న అలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమధుర కళానికేతన్ హాస్యపోటీల స్ఫూర్తిదాత, సినీ దర్శకుడు దివంగత జంధ్యాల స్మారక పురస్కారాన్ని హాస్యనటుడు ఆలీ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో సున్నితమైన హాస్యానికి జంధ్యాల నాంది పలికారని, జంధ్యాల స్ఫూర్తితో పుష్పగుచ్ఛం గానీ, శాలువా గానీ అందుకుంటే అమితానందాన్ని కలిగిస్తాయని చెప్పారు.

Ali receives Jandhyala Award

జంధ్యాల దర్శకత్వంలో నటించడం తన అదృష్టంగా ఆలీ పేర్కొన్నారు. కేవలం జంధ్యాల అవార్డు కోసమే విజయవాడ వచ్చానని తెలిపారు.

English summary
Comedian Ali receives Jandhyala Award.
Please Wait while comments are loading...