Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
మంచి కథ దొరికితే తప్ప సినిమా చేయకూడదని అనుకున్న హీరో..
''మంచి కథ దొరికితే తప్ప హీరోగా సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. దర్శకుడు వేమగిరి వచ్చినపుడు కూడా అదే చెప్పాను. అయితే తను కథ చెప్పాక వెంటనే హీరోగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తిమ్మరాజు కచ్చితంగా డిఫరెంట్ సినిమా అవుతుంది. ఇందులో నా గెటప్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది"" అని అలీ చెప్పారు. ఆయన కథానాయకునిగా రూపొందిన చిత్రం 'తిమ్మరాజు". శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై వేమగిరి దర్శకత్వంలో పులిరత్నం, కేఎస్సెస్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ''రాళ్లు" అనే లఘు చిత్రంతో నాకు మంచిపేరు వచ్చింది. ఈ సినిమాతో కమర్షియల్ డెరైక్టర్‌గా మంచి గుర్తింపు వస్తుంది"" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందులో అలీ తాతగా చేశానని, మా గెటప్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఏవీయస్, ప్రసన్నకుమార్, దువ్వాసి మోహన్, డి.శ్రీనివాస ఓంకార్ కూడా మాట్లాడారు. చిన్న, దీప్తి, శివకృష్ణ, జీవా, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, కెమెరా: ఎన్.కోటేశ్వరరావు.