twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి కథ దొరికితే తప్ప సినిమా చేయకూడదని అనుకున్న హీరో..

    By Nageswara Rao
    |

    ''మంచి కథ దొరికితే తప్ప హీరోగా సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. దర్శకుడు వేమగిరి వచ్చినపుడు కూడా అదే చెప్పాను. అయితే తను కథ చెప్పాక వెంటనే హీరోగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తిమ్మరాజు కచ్చితంగా డిఫరెంట్ సినిమా అవుతుంది. ఇందులో నా గెటప్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది"" అని అలీ చెప్పారు. ఆయన కథానాయకునిగా రూపొందిన చిత్రం 'తిమ్మరాజు". శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై వేమగిరి దర్శకత్వంలో పులిరత్నం, కేఎస్సెస్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ''రాళ్లు" అనే లఘు చిత్రంతో నాకు మంచిపేరు వచ్చింది. ఈ సినిమాతో కమర్షియల్ డెరైక్టర్‌గా మంచి గుర్తింపు వస్తుంది"" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇందులో అలీ తాతగా చేశానని, మా గెటప్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఏవీయస్, ప్రసన్నకుమార్, దువ్వాసి మోహన్, డి.శ్రీనివాస ఓంకార్ కూడా మాట్లాడారు. చిన్న, దీప్తి, శివకృష్ణ, జీవా, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, కెమెరా: ఎన్.కోటేశ్వరరావు.

    English summary
    Ali is playing the title role for ‘Timmaraju’ (Maa team leader), directed by Vemagiri and produced by Puli Ratnam and KSS Kumar on the banner of Sri Films Productions. Though it is a low-budget film, the action episodes in the film were shot with five cameras under the action choreography of Ram-Laxman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X