వైయస్ జగన్ ని కలుస్తూనే ఉంటా...హాస్యనటుడు అలీ
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్ ని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటా అంటున్నారు హాస్యనటుడు అలీ. ఆయన రంజాన్ సందర్భంగా పాతబస్తీ మదీనా సర్కిల్ లో షాపింగ్ కు వచ్చారు. తనను కలిసిన మీడియాతో ఇలా చెప్పారు. అలాగే జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిని కలిసినప్పుటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ...వైఎస్ అంటే ఎనలేని అభిమానమని...ఆయన ఇంటికి దగ్గర్లోనే ఉండటం వల్ల ఎన్నోసార్లు కలిసే అదృష్టం కలిగిందని చెప్పారు. 'ప్రస్తుత ఎమ్మెల్యే, సినీనటి జయసుధతో కలిసి ఏడాదిన్నర కిందట వైఎస్ ఇంటికి వెళ్లా. నమస్తే సార్...అని అభివాదం చేశా. వెంటనే ఆయన...చెప్పు అలీ...ఎలా ఉన్నావ్...అందరినీ బాగానే నవ్విస్తున్నావుగా..అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. ఉప్పొంగిపోయా అన్నారు. ఇక ప్రస్తుతం అలీ హీరోగా తిమ్మరాజు అనే సినిమా వేమగిరి అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











