లైవ్ ఇంటర్వ్యూలో యాంకర్ ఓవరాక్షన్.. మెడ పట్టుకొని కొట్టేవరకు వెళ్లిన అలీ రెజా

ఇంటర్వ్యూలలో సడన్ గా కొన్ని ప్రశ్నలకు సెలబ్రెటీలు హర్ట్ అవ్వడం చాలా కామన్. అయినప్పటికీ స్టార్స్ చాలా కూల్ గా సమాధానాలు చెబుతూ ఉంటారు. అయితే మరికొన్ని సార్లు గొడవల డోస్ కూడా పెరుగుతుంటుంది. చాలా వరకు ఆఫ్ స్క్రీన్ లో కొట్టుకునే వరకు గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇటీవల ఆన్ లో ఉన్న కెమెరా ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా యాంకర్ మెడ పెట్టుకొని కొట్టేవరకు వెళ్ళాడు.

నాభి‌ ప్రదర్శనతో శ్రద్దా దాస్ అందాల ఆరబోత.. క్రేజీ ఫోటోషూట్ వైరల్...

బిగ్ బాస్ 3 ద్వారా..

బిగ్ బాస్ 3 ద్వారా..

అలీ రెజా బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ లో కంటెస్టెంట్ గా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు వరకు నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించిన అలీ రెజా ఎప్పుడైతే బిగ్ బాస్ లో కనిపించాడో అప్పటి నుంచి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను అందుకున్నాడు.

కోపం కారణంగా..

కోపం కారణంగా..

అయితే అతనికి కోపం కూడా ఎక్కువే అని అప్పట్లో నాగార్జున చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లో అతను చేసిన హంగామా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. కానీ కోపం కారణంగా అతను ఫైనల్స్ వరకు ఉండలేకపోయాడు. ఇక నాగార్జున ఆ తరువాత అతనికి వైల్డ్ డాగ్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇప్పించాడు.

యాంకర్ తక్కువ చేసి మాట్లాడంతో

యాంకర్ తక్కువ చేసి మాట్లాడంతో

అలీ రెజా ఇప్పుడు తన ఆశలన్నిటిని వైల్డ్ డాగ్ సినిమాపైనే పెట్టుకున్నాడు. సినిమా కథలో చాలా కీలకమైన పాత్ర కావడంతో సినిమా హిట్టవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నాడు. అందుకే తీరిక లేకుండా నటీనటులతో కలిసి ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ చాలా తక్కువ చేసి మాట్లాడంతో అలీ గొడవకు దిగాడు.

అతని మెడ పట్టుకున్నాడు

అతని మెడ పట్టుకున్నాడు

నాగార్జున లేకుండా కేవలం విళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు అంటూ యాంకర్ అనడంతో అలీ కోపానికి లోనయ్యారు. పది నిమిషాల అనంతరం మాటా మాటా పెరగడంతో గొడవ కూడా ముదిరింది. అలీ రెజా ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ పైకి కోపంతో వెళ్లి అతని మెడ పట్టుకున్నాడు. ఇతర నటీనటులు ఆపే ప్రయత్నం చేసినప్పటికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

అసలు ఎం జరిగిందంటే..

అసలు ఎం జరిగిందంటే..

అందుకు సంబంధించిన క్లిప్పింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. జనాలు కూడా అది నిజమని అనుకున్నారు. అయితే యూ ట్యూబ్ ఒరిజినల్ విడియోలోకి వెళ్ళాక అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. అదంతా ప్రాంక్ వీడియో అని. తెలుగులో బెస్ట్ యూ ట్యూబ్ ప్రాంక్ ఛానెల్ గా క్రేజ్ అందుకున్న ఫన్ పటాక వాళ్ళు చిత్ర యూనిట్ పై ప్రాంక్ చేశారు.

యాంకర్ కిరణ్ చేసిన హడావుడికి అందరూ షాక్ అయ్యారు. అయితే అలీ రెజాకు కూడా ఆ విషయం ముందే తెలుసు. కరెక్ట్ ప్లాన్ తో తోటి నటీనటులపై అలా ప్రాంక్ చేసి సినిమాపై ఓ విధంగా బజ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X