ఆ విషయంలో ఆగలేకపోతోన్నా.. బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా పోస్ట్
బిగ్‌బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయిన కంటెస్టెంట్ అలీ రెజా. బుల్లి తెర సీరియల్స్‌తో ఇంటిల్లి పాదిని అలరించిన అలీ.. వెండితెరపై అడపాదడపా చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ పక్కన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు. బుల్లితెరపై ధారావాహికల ద్వారా వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. ఆ రియాల్టీ షోలో అలీ రెజా ఆడిన తీరు, మాట్లాడిన విధానం, పోట్లాడిన సన్నివేశాలు ఇలా ప్రతీ ఒక్కటి ఆయన్ను ఫేమస్ చేశాయి.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అలీ రెజాకు అదిరిపోయే అవకాశం వచ్చింది. ఓ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రంలో మంచి పాత్రను దక్కించుకున్నాడు. మరాఠా చిత్రమైన నట సామ్రాట్ చిత్రాన్ని కృష్ణవంశీ రంగమార్తాండగా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలీ ఓ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన స్టిల్స్ ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండగా.. అన్ని కార్యకలాపాలు మూలన పడ్డాయి. దీంతో షూటింగ్స్ లేక అలీ రెజాకు బాగానే బోర్ కొడుతోన్నట్టుంది. ఈ మేరకు రంగమార్తాండ ఫస్ట్ డే షూట్‌కు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేస్తూ.. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా షూటింగ్ ప్రారంభం కావాలి.. ఆగలేకపోతోన్నా' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











