సునీల్ సినిమాలో కమెడియన్ అలి డామినేషన్!
గత కొన్ని రోజుల క్రితం పరిస్థితి చూస్తే ఏ పెద్ద హీరో సినిమా చూసినా అందులో సునీల్ ఫుల్ లెన్త్ కామెడీ రోల్ లో కనిపిస్తూ కామెడీ పార్టును అంతా డామినేట్ చేసే వాడు. తాజాగా సునీల్ హీరోగా మారిన నేపథ్యంలో....అతని 'పూల రంగడు' సినిమాలో కమెడియన్ అలి ఫుల్ లెన్త్ కామెడీ రోల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే గతంలో సునీల్ పోషించిన కామెడీ పార్ట్ ను ఇప్పుడు ఈ సినిమాలో అలీ డామినేట్ చేస్తున్నాడన్నమాట.
సునీల్ కెరియర్ లోనే అత్యధికంగా దాదాపు 450 ప్రింట్లతో విడుదలవుతున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో దూకుతోంది. ఒకప్పుడు కామెడీ ఫేసుతో, లావెక్కిన శరీరంతో ఉండే సునీల్....ఈ సారి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా అబ్బుర పడేలా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు.
ఇప్పటికే టాకీ పార్టు మొత్తం పూర్తి చేసుకున్న పూల రంగడు సినిమా...ప్రస్తుతం పాటల చిత్రకరణ జరుపుకుంటోంది. ఈవారంలో ఈ పనులు కూడా పూర్తి చేసుకని జనవరి మొదటి వారంలో ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకోనుంది.
ఆర్ ఆర్ మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలి, ప్రదీప్ రావత్. దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











