రామ్ చరణ్ పేరు చెప్పి అలీ చిత్రాన్ని అమ్ముదామని...
''సినిమా అంతా యంగ్ హీరో రామ్‌చరణ్ చుట్టూ తిరుగుతుంది. కానీ చరణ్ ఒక్క దృశ్యంలోనూ కనిపించరు. మా కథకీ చరణ్‌కీ సంబంధం ఏమిటో సినిమా చూస్తేనే తెలుస్తుందని ప్రచారం చేస్తున్నారు తిమ్మరాజు'చిత్రం నిర్మాతలు. అలీ హీరోగా వేమగిరి దర్శకత్వంలో శ్రీ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పులిరత్నం, కె.ఎస్.ఎస్.కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుకు విడుదల ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం విశేషాలు వివరించటానికి నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఇలా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ని ప్రస్తావన తేవటం ద్వారా చిత్రానికి క్రేజ్ తీసుకొచ్చి సినిమాని ప్రమోట్ ఆలోచనలో చేసిన ప్రయత్నం ఇది.
అలాగే ..'రామ్-లక్ష్మణ్‌లను ఫైట్ మాస్టర్లుగా పెట్టి ఐదు కెమెరాలతో చిత్రించిన యాక్షన్ ఎపిసోడ్ 'తిమ్మరాజు' ప్రత్యేకత. చిన్న సినిమా అయినా ఎక్కడా ఖర్చుకు వెనక్కి తగ్గకుండా చిత్రించారు. పూర్తి వినోదభరితంగా తయారైన ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు. ఇక అలీ మాట్లాడుతూ.. 'తిమ్మరాజు' కథ వినగానే వైవిధ్యంగా అనిపించింది. దర్శకుడు నాకు ఏం చెప్పాడో అదే తెరకెక్కించాడు'' అని చెప్పారు.
ఇక దర్శకుడు కథ గురించి చెబుతూ.. బక్కపల్చగా ఉన్నవాళ్లంతా బ్రూస్లీలే అని భ్రమపడిన ఓ బృందానికి తిమ్మరాజు నాయకుడు. 'యా.. హూ' అని అరిస్తే చాలు.. కరాటే వచ్చేసినట్టే అని వాళ్ల నమ్మకం. వాలకంలానే అతని ఆలోచనలు కూడా విచిత్రంగా ఉంటాయి. అలాంటి తికమకల తిమ్మరాజు ఓ ప్రేమ జంటని ఎలా కలిపాడో మా సినిమాలో చూడండి అంటున్నారు.


Click it and Unblock the Notifications











