For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలీ చంపేస్తున్నాడు! పెద్దగా ఉందంటూ ‘సమంత’ వింత ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హాట్ హీరోయిన్ సమంత ఈ మధ్య తన ట్విట్టర్లో వింత వింత పోస్టులు చేస్తోంది. తాజాగా ఓ ఫోటోను పోస్టు చేసి దానికి దానికింద వింతైన కామెంట్ చేసింది. 'అలీ విశాలమైన చేయి ద్వారా మరణం. అతను చాలా పెద్ద చేయి కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఇంత పెద్ద చేయిని చూడలేదు' అంటూ సమంత ట్వీట్ చేసింది.

    ప్రస్తుతం ఆమె, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా పొల్లాచ్చిలో ఉంది. షూటింగ్ స్పాట్లో ఆలీతో సరదాగా తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది.

    మరో హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈచిత్రానికి 'తుఫాన్', 'సరదా' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఏ టైటిల్ కూడా అధికారికంగా ఖరారు చేయలేదు.

    పూర్తిగా కమర్షియల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రం పవన్ కళ్యాన్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులు, స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ కానుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Ali and Samantha at Pollachi shooting of Pawan Kalyan - Trivikram untitled new movie. "Death by Ali garus ginormous hands.. He has the largest hands I've ever seen!" samantha tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X