జిగ్రా వసూళ్లకు మించి హిరోయిన్ రెమ్యునరేషన్.. వివాదంగా ఆలియా పారితోషికం
బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలి అంటే దానికి నిఖార్సయిన స్టార్ హీరో సినిమా ఉండాలి అనేది ఒకప్పుడు మాట. కానీ ఇప్పడు ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర కనీ వినీ ఎరుగని రికార్డులు మహిళా నటులు కూడా కొట్టగలరు అని చూపిస్తున్నారు. కాగా ఈ లిస్ట్ ఇప్పుడు మరింత పెరుగుతూ వస్తుంది. ఇలా ఫీమేల్ యాక్టర్స్ తాలూకా డామినేషన్ ఇండియన్ సినిమా దగ్గర ఊపందుకుంది.
మరి రీసెంట్ గానే బాలీవుడ్ సినిమా దగ్గర శ్రద్దా కపూర్ నటించిన హారర్ చిత్రం "స్త్రీ 2" 860 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా హిందీలో శ్రద్దా కపూర్ సహా చాలా మంది బిగ్ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ నుంచి రీసెంట్ గా ఓ సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది.

కాగా స్త్రీ 2 సినిమా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఇది ఏకంగా 800 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. కానీ మరో సినిమా 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి అందులో సగం కూడా రాబట్టలేక స్ట్రగుల్ అవుతుంది. మరి ఆ హీరోయిన్, సినిమా ఏవో కాదు టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఆలియా భట్ నటించిన చిత్రం "జిగ్రా".
ఈ సినిమా ఈ దసరా కనుకగా హిందీ తెలుగులో విడుదల అయ్యింది. కానీ సినిమాలో విషయం లేక తేలిపోయింది. కాగా ఈ సినిమానే 80 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఇది 50 కోట్ల మార్క్ ని కూడా అందుకోడానికి చాలా కష్టపడుతుంది అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
కాగా ఈ సినిమాకి వసూళ్లు ఏమో కానీ ఆలియా భట్ మాత్రం మంచి రెమ్యునరేషన్ నే అందుకున్నట్టు తెలుస్తోంది. కాగా జిగ్రా కోసం ఆలియా ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకున్నట్టుగా తెలుస్తోంది. దీనితో సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమె శాలరీ మాత్రం బాగానే అందుకుంది అని చెప్పాలి.

మరి ఈ సినిమాని దర్శకుడు వాసన్ బాల తెరకెక్కించగా కరణ్ జోహార్ నిర్మాణం వహించారు. మరి ఆలియా భట్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సోలో మూవీ ఊహించని విధంగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా కోసం ఎప్పుడూ లేనిది తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపించుకుంది. ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ తో దేవర సమయంలో హిందీలో కూడా చేసింది.
అయినా కూడా సినిమా ప్లాప్ గానే నిలిచింది. తన భర్త రన్బీర్ కపూర్ బాట లోనే తను కూడా ట్రై చేసింది కానీ ఇవి వర్కవుట్ కాలేదని చెప్పాలి. కాగా ఈ సినిమా తర్వాత ఆలియా నుంచి మరిన్ని భారీ సినిమాలు లైనప్ లో ఉండగా ఈ సినిమాలలో సౌత్ హీరోస్ తో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి రామ్ చరణ్ తో RRR లో నటించిన ఆలియా నెక్స్ట్ ఎన్టీఆర్ తో కూడా జత కట్టనుంది అని బజ్ ఉంది.


Click it and Unblock the Notifications











