»   » డైరెక్టర్ కూతురు అలా: 10 మందితో డేటింగ్...

డైరెక్టర్ కూతురు అలా: 10 మందితో డేటింగ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్ కరణ్ జోహార్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టెనర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు తర్వాత హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, హాట్ అండ్ సెక్సీ సీన్లలో ఎలాంటి జంకు లేకుండా నటించే విషయాల్లో అమ్ముడు బాగా ఆరితేరింది. దీంతో త్వరలోనే అలియా భట్ బాలీవుడ్లో మంచి పొజిషన్ కి చేరుకుంటుందని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు. సినీ విమర్శకుల నుండి కూడా అమ్మడుకి ప్రశంసలు అందాయి.

 Alia Bhatt advice, Date 10 men

కేవలం ఇలాంటి విషయాల్లో మాత్రమే కాదు...బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చే విషయంలోనూ అలియా భట్ ఓ అడుగు ముందే ఉంది. ప్రేమ, పెళ్లి గురించి అలియా భట్ సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఒక మహిళ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రతగా ఉండాలి. కనీసం 10 మంది మగాళ్లతో డేటింగ్ చేయాలి. అప్పుడే ఎవరు బెస్ట్ అనే విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. చివరగా ఆ పది మందిలో ఒకరిని సెలక్ట్ చేసుకోవాలి అంటోంది.

ఇంకా 21 ఏళ్ల వయసులోనే ఉన్న అలియా భట్ జోరు చూస్తుంటే...... లవ్ ఎఫైర్లు మొదలు పెట్టేలా ఉంది. 10 మందితో డేటింగ్ చేయాలసి అడ్వైజ్ ఇస్తున్న అలియా భట్ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఎంత మందితో డేటింగ్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం అలి భట్ అగ్లీ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు షాందార్ అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Alia Bhatt said that a woman has to date 10 men and then learn about their interests and then pick one from the ten.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu