RRRలో రాంచరణ్‌తో.. బన్నీ 'ఐకాన్'కి కూడా ఓకే చెబుతుందా!

అలియా భట్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న చిత్రాలు సాధారణమైనవి కావు. ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో అలియా భట్ అవకాశాలు దక్కించుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్ రాంచరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా ప్రతిభకు తగ్గట్లుగానే అద్భుత అవకాశాలు వస్తున్నాయి. అలియా భట్ ని మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 సీత పాత్రలో

సీత పాత్రలో

అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో నటించనుంది. రాజమౌళి చిత్రాలన్నీ గమనిస్తున్నానని, ఆయన అద్భుతమైన దర్శకుడు కావడం వల్లే ఆర్ఆర్ఆర్ చిత్రానికి అంగీకరించినట్లు అలియా భట్ పేర్కొంది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆయన మరదలు సీత పాత్రలో అలియా భట్ నటిస్తోంది. త్వరలో నార్త్ ఇండియాలో జరగబోయే షెడ్యూల్ లో అలియా భట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానుంది.

 ఐకాన్‌కి ఓకే చెబుతుందా

ఐకాన్‌కి ఓకే చెబుతుందా

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ఐకాన్ కనబడుటలేదు అనే టైటిల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అలియా భట్ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ త్వరలో అలియా భట్ ని కలసి కథ వివరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అలియా భట్ అయితే బావుంటుందని భావిస్తున్నారట. అలియా భట్ నటిస్తున్న తొలి సౌత్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడు బన్నీ సినిమాకు కూడా ఓకే చెబుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.

డ్యూయెల్ రోల్

డ్యూయెల్ రోల్

ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ ఇంతవరకు ద్విపాత్రాభినయం చేయలేదు. బన్నీ ఈ చిత్రంలో రెండు వేరు వేరు గెటప్స్ లో కనిపిస్తాడట. ఓ పాత్రలో పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంతవరకు పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా చేయలేదు. రేసు గుర్రం చిత్రంలో మాత్రం కాసేపు పోలీస్ గెటప్ లో కనిపిస్తాడు.

దిల్ రాజు నిర్మాణంలో

దిల్ రాజు నిర్మాణంలో

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐకాన్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. బన్నీ, దిల్ రాజు కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. వారిద్దరి కాంబోలో ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఐకాన్ పార్రంభం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X