కన్నీరుమున్నీరైన RRR హీరోయిన్.. అదే తలచుకుంటూ వెక్కివెక్కి ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియో

తెలుగు తెరపై మొదటిసారి కాలుమోపుతున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ విషయమై కన్నీరుమున్నీరైంది. మీడియా ముందే, అదీ అందరూ చూస్తుండగానే ఆమె కన్నీరు పెట్టుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆలియా కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఏంటి? మీడియా ముందు ఆలియా ఎందుకిలా చేసింది? ఆ వివరాలు చూద్దామా..

ఆలియా భట్ సోదరి ఇష్యూ

ఆలియా భట్ సోదరి ఇష్యూ

ఆలియా భట్ సోదరి పేరు షహీన్. ఈమె కొంతకాలం క్రితం తీవ్ర డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో ఈమెతో పాటు ఆలియా కూడా ఎంతో బాధపడింది. అయితే దానికి ట్రీట్‌మెంట్ తీసుకున్నాక మెల్లగా కోలుకుంది ఆలియా సోదరి. అయితే తాను డిప్రెషన్‌ వల్ల పడిన బాధలు, చేసిన పోరాటం గురించి తెలుపుతూ షహీన్ ఓ పుస్తకం రాసింది.

ముంబయిలో ఆలియా భట్.. తీవ్ర భావోద్వేగం

ముంబయిలో ఆలియా భట్.. తీవ్ర భావోద్వేగం

‘ఐ హావ్ నెవర్ బీన్ హ్యాపీయర్' అనే పేరుతో పుస్తకాన్ని రాసిన షహీన్.. దాంట్లో తన డిప్రెషన్‌ తాలూకు విషయాలు వివరించింది. ఈ పుస్తకాన్ని ఆదివారం రోజు ముంబయిలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలియా భట్.. తన సోదరి డిప్రెషన్‌తో ఎలా బాధపడిందో వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సమస్య ఏంటో అర్థమైందని తెలుపుతూ కన్నీరు పెట్టుకున్న ఆలియా

సమస్య ఏంటో అర్థమైందని తెలుపుతూ కన్నీరు పెట్టుకున్న ఆలియా

ఎట్టకేలకు తన సోదరి షహీన్.. డిప్రెషన్ నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్న ఆలియా, తన సోదరి రాసిన బుక్ చదివాక ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థమైందని తెలుపుతూ కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆలియా సోదరి ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.

రామ్ చరణ్ జోడీగా ఆలియా

ప్రస్తుతం ఆలియాభట్ RRR సినిమాలో నటిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ జోడీగా నటిస్తోంది ఆలియా. ఇప్పటికే ఈమె రోల్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో తిరిగి ముంబై వెళ్లిందట ఆలియా.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
RRR మూవీ..

RRR మూవీ..

RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్‌లో నటిస్తున్నాడు. చిత్రంలో రామ్ చరణ్- ఆలియాలపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2020 జులై నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X