ప్రభాస్ ఖాతాలో మరో డై హార్డ్ ఫ్యాన్.. అందుకే ఆయనంటే పిచ్చి అంటూ యంగ్ హీరోయిన్!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా కరోనావైరస్ కంటే దారుణంగా పాకిపోయింది. సగటు ప్రేక్షకులే కాదు.. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు ఫిదా అవుతున్నారు. ఆయన పెర్ఫార్మెన్స్‌కు తాజాగా మరో హీరోయిన్ డై హార్డ్ ఫ్యాన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ తాజా ఇంటర్వ్యూలో తాను ఎందుకు అభిమానిగా మారిపోయానంట అంటూ చెప్పారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..

Recommended Video

Alia Bhatt Surprised All, Became Die Hard Fan Of Prabhas
బాలీవుడ్ టూ టాలీవుడ్

బాలీవుడ్ టూ టాలీవుడ్

బాలీవుడ్ నుంచి ఏటా దిగుమతి అయ్యే హీరోయిన్ల జాబితాలో ప్రతిభావంతురాలైన నటి ఆలియా భట్ చేరిపోయారు. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించే RRR చిత్రంలో సీత పాత్రలో రాంచరణ్ సరసన నటిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా మూవీ ద్వారా ఆలియా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో అలియా భట్ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రభాస్ పెర్ఫార్మెన్స్ పిచ్చెక్కించింది

ప్రభాస్ పెర్ఫార్మెన్స్ పిచ్చెక్కించింది

తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రతిభ గురించి మాటల కోటను కట్టేసింది. బాహుబలిలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అభిమానిగా మారిపోయాను. ఆయన నటన అద్భుతం. మాటల్లో వర్ణించలేం. అతనితో అవకాశం వస్తే నటించడానికి సిద్దం అని అలియాభట్ చెప్పారు.

నేను డై హార్డ్ ఫ్యాన్‌ని

నేను డై హార్డ్ ఫ్యాన్‌ని

బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ అంటే ఇష్టం పెరిగిపోయింది. అతడి పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ నన్ను చాలా ఆకట్టుకొన్నాయి. బాహుబలి సిరీస్‌లో ప్రభాస్ నటన ఆమోఘం. బాహుబలి సిరీస్ చూసిన తర్వాత నేను డై హార్డ్ ఫ్యాన్ జాబితాలో చేరిపోయాను అని అలియా భట్ ప్రత్యేకంగా చెప్పడం విశేషం.

అలియా భట్ కెరీర్ గురించి

అలియా భట్ కెరీర్ గురించి

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో ప్రస్తుతం అలియాభట్ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. డిసెంబర్‌లో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లికి సిద్ధమవుతున్నారు. రణ్‌బీర్‌తో కలిసి అలియా బ్రహ్మాస్త్రలో నటిస్తున్నారు. గుంగూభాయ్ కథియావాడీ, సడక్ 2 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే RRR మూవీ ఆమె ఖాతాలోనే ఉంది.

ప్రభాస్ కెరీర్ గురించి

ప్రభాస్ కెరీర్ గురించి

ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. సాహో తర్వాత ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే మహానటి ఫేం నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్‌పైకి వెళ్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X