డైరెక్టర్ కూతురు పబ్లిసిటీ కోసం లంగా ఎత్తి.. (ఫోటో)
ముంబై: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్. బాలీవుడ్లో అడుగు పెట్టిందే తడువు వేగంగా దూసుకెలుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్...చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది.
సినిమాల్లో ఇలాంటి వన్నీ చేసి పేరు పబ్లిసిటీ, పాపులారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే....మేగజైన్ల కవర్ పేజీల కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోవడం మరో ఎత్తు. బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఎదిగిన భామలంతా మేగజైన్ల ఫోటో షూట్ల ద్వారా అదనపు పబ్లిసిటీ సంపాదించిన వారు. టాప్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో అలియా భట్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది.

ఇప్పటికే పలు మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చిన అలియా తాజాగా ఫెమినా మేగజైన్ డిసెంబర్ ఇష్యూ కవర్ పేజీ కోసం లంగా ఎత్తి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కెరీర్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందాలనేది అలియా భట్ ఆశ పడుతోంది.
తనకు కాబోయే భర్త తన తండ్రిలా మాత్రం ఉండొద్దని అలియా భట్ అంటోంది. తండ్రి మహేష్ భట్ అంటే అలియాకు ఎంతో ఇష్టం. అయితే తన భర్త మాత్రం అందుకు భిన్నంగా ఉండాలని కోరుకుంటోంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో అలియా భట్ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











