నాగార్జున గారిని టార్చర్ పెట్టా.. బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో అలియా భట్ కీలక వ్యాఖ్యలు
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. శనివారంనాడు ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రాజమౌళి రిలీజ్ చేశారు. అనంతరం ఈ వేడుకలో పాల్గొన్న అలియా భట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

మోషన్ పోస్టర్ రిలీజ్
బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ రిలీజ్ ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇదే ఈవెంట్ లో పాల్గొన్న అలియా భట్ 'బ్రహ్మాస్త్ర' గురించి మాట్లాడుతూ "బాగున్నారా... " అంటూ మొదలెట్టిన అలియా "రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు... ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారని చెప్పుకొచ్చింది.

ఏడేళ్ల కష్టం
బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం, ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నామన్నారు. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్న ఆమె ఈరోజు మేము హైదరాబాద్ లో సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి వచ్చామనీ, ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందన్న ఆమె సినిమాకు భాష అడ్డం కాదని గత రెండ్రోజులుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు అందరి నుంచి రెస్పాన్స్ వచ్చిందిని చెప్పుకొచ్చింది.

స్థానం సంపాదించుకుంటుంది
రాజమౌళి ఎక్కడికెళ్లినా సినిమాపై ఫ్యాషన్, సపోర్ట్, అమేజింగ్ అని, ఆయన ఎనర్జి చూస్తుంటే ఏదో డ్రీంలో ఉన్నట్టుగా అన్పిస్తోందనీ చెప్పుకొచ్చింది, ఆయనకు అన్ని విషయాల మీద ఉన క్లారిటీ అమోఘం అని ఆమె వెల్లడించింది. 'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి, చరణ్, తారక్, నేను కోరుకుంటున్న లవ్, ఎమోషన్ ప్రేక్షకుల నుంచి రావడం అమేజింగ్ గా ఉందన్న ఆమె ఈ సినిమా వెరీ స్పెషల్... ఈ సినిమా బాగుటుంది, పెద్దది, చిన్నది వంటి పదాలు కామన్ అయ్యాయి కాబట్టి వాడను. కానీ ఈ సినిమా మీ అందరి మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది అని మాత్రం నమ్మకంగా చెప్పగలనన్నారు.

అన్ని విషయాలను గమనిస్తారు
రాజమౌళి గారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్న ఆమె ఆయన స్టేజ్ పై ఎలా నిలబడుతున్నాము ? ఎలా చూస్తున్నాము ? ఎలా మాట్లాడుతున్నాము ? ఇలా అన్ని విషయాలను గమనిస్తారు. ఇక ఆయన ఇక్కడికి రావడం, ఆయన సమయాన్ని కేటాయించడం అనేది మాకు చాలా విలువైన విషయం అని అన్నారు. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది 'ఆర్ఆర్ఆర్' డే అంటూ అయాన్ అసలు పనే చేయలేదన్న ఆమె ఆయన మీకు పెద్ద ఫ్యాన్..." అంటూ రాజమౌళి అతిథిగా హాజరైన విషయం గురించి పేర్కొంది.

టార్చర్ పెట్టా
నాగార్జున గారు మా నాన్నతో పని చేశారన్న ఆమె ఇప్పుడు నేను, ఆయన కలిసి పని చేశాము. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారని, చిత్రబృందం మొత్తం సెట్స్ లో ఆయన గురించే ఎక్కువగా వెయిట్ చేసేవారు అంటూ నాగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక నాగార్జున, అమలను మా అమ్మానాన్న కలిశారన్న ఆమె సినిమా షూటింగ్ సమయంలో ఈ జంటను కలిసి మా అమ్మానాన్న వారి గురించే మాట్లాడేవారు అని అన్నారు.
నాగార్జున వంటి నైసెస్ట్ పర్సన్ ని నేను ఇంతకుముందు చూడలేదన్న ఆమె ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది అంటూ నాగార్జునపై అలియా భట్ పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే ఆయనను కొన్ని విషయాల్లో టార్చర్ చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











