twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయ్ ఫ్రెండ్ గురించి అడిగితే గయ్యిమంది(వీడియో)

    By Srikanya
    |

    ముంబై : హీరోయిన్స్ పబ్లిసిటీ కోసమో...వేరే దాని కోసమో...చాలా చిత్రంగా బిహేవ్ చేస్తూంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ మరీను. నేషన్ వైడ్ మార్కెట్ కలిగిన హీరోయిన్స్ ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. వాడు పర్శనల్ లైఫ్ కి స్పందించి ఇచ్చే సమాధానాలు మరింత చిత్రంగా ఉంటాయి. తాజాగా ఆలియా భట్ తన బోయ్ ఫ్రెండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా ఇచ్చిందో చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆలియా భట్‌ - సిద్ధార్థ్‌ మల్హోత్రా మధ్య ఉన్న బంధమేంటి? బాలీవుడ్‌లో చాలా కాలం నుంచి నడుస్తోన్న చర్చ ఇది. స్నేహితులా... ప్రేమికులా? ఈ ప్రశ్నకు ఆలియా లేదంటే సిద్ధార్థే సమాధానం చెప్పాలి. ఈ ఇద్దరూ ఇందుకు సుముఖంగా లేరు. ఇటీవల ఇదే ప్రశ్న ఆలియాను అడిగితే 'నా సొంత విషయాలు అందరికీ చెప్పాలా?' అని అంతెత్తు ఎగిరింది. ఇప్పుడు ఈ బంధం గురించి నోరు విప్పినట్లుందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

    ప్రముఖ ఫ్యాషన్‌ పత్రిక వోగ్ కు ఆలియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయంట. ఈ పత్రిక రూపొందించిన టీజర్‌ వీడియోలో ఆలియాను చాలా ప్రశ్నలు వేశారు. చాలా ప్రశ్నలకు టపీటపీమని వూ కొట్టిన ఆలియా 'సిద్ధార్థ్‌కు నీకు మధ్య ఉన్న బంధమేంటి?' అనేసరికి ఉలిక్కిపడి లేచి 'వెళ్లి పత్రిక చదివి తెలుసుకొండి' అంటూ గయ్యిమంది.

    మరి అందులోనైనా చెప్పిందా? లేక 'మీకెందుకు' అంటుందా చూడాలి. అన్నట్లు 'రణ్‌బీర్‌ కపూర్‌ నా మొదటి క్రష్‌' అంటూ ఇందులోనే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

    Alia Bhatt: My Biggest Crush Is Ranbir, And Other Truths

    కొంత కాలంగా బాలీవుడ్ ను ఏలుతున్న ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ అవకాశాలకు ఎసరు పెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది యంగ్ బ్యూటీ అలియా భట్. మహేశ్ భట్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినా.. షార్ట్ గ్యాప్ లోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

    సీనియర్ బ్యూటీస్ కు పంటికింద రాయిలా.. బాలీవుడ్ సినీజనాలకు నోరూరించే పిప్పర్ మెంట్ బిళ్లలా మారిన అలియా భట్ సెక్సీ ఫిగర్ తోనే కాదు.. పర్ఫామెన్స్ లోనూ కేక పుట్టిస్తోంది... ఒకప్పుడు బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా ఇమ్రాన్ హష్మి పేరే వినిపించేది.

    ఇప్పుడు ఈ సెక్సీ ఇమేజ్ ఈ చిన్నదాని సొంతమైపోయింది. అలియా నటించిన ప్రతి సినిమాలోనూ హీరోలతో లిప్ లాకులు వేస్తూ.. ఆడియెన్స్ కు కావాల్సినంత కిక్ అందించింది... ఇప్పటికే తన టాలెంట్ చూపించి.. బి-టౌన్ ను బోల్డ్ చేసేసిన ఈ సెక్సీ లేడి.. రీసెంట్ గా సింగర్ గానూ సత్తా చాటుతోంది... ఇప్పటికే రెండు పాటలేసుకున్న ఈ పాప.. తన సంగీత పరిజ్జానాన్ని విస్తరించాలని ట్రై చేస్తోందట.

    English summary
    Vogue India released an official teaser of Miss Vogue Alia Bhatt. In the video, we see Highway actress answering the questions in a very unique way. The actress is on her bed, eyes closed and like a sleepy head, Alia answers questions accordingly but the moment a question about dating Sidharth Malhotra comes up, the actress gets up from the bed and very smartly screams at the camera saying, “Wanna know more about me, then go buy Miss Vogue!”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X