»   » ప్రభాస్ కోసం పడిచస్తున్న బాలీవుడ్ హీరోయిన్.. షారుక్‌‌‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి షాక్..

ప్రభాస్ కోసం పడిచస్తున్న బాలీవుడ్ హీరోయిన్.. షారుక్‌‌‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో షారుక్ ఖాన్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్జు పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం తొలుత కత్రినా కైఫ్, దీపికా పదుకొనే పేర్లను పరిశీలించారట. అయితే వారు బిజీగా ఉండి డేట్స్ కుదరకపోవడంతో ఇటీవల ఆలియాభట్‌ను సంప్రదించారట. అయితే షారుక్ ప్రాజెక్ట్‌లో చేయడానికి అలియా నిరాకరించిదనే విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో డియర్ జిందగీ చిత్రంలో షారుక్‌తో అలియాభట్ నటించిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నానని, ఒకవేళ అవకాశం వస్తే వదులుకోనని చెప్పడం ఇందులో టిస్ట్‌గా మారింది.

  షారుక్ ఆఫర్ రిజెక్ట్

  షారుక్ ఆఫర్ రిజెక్ట్

  షారుక్ ఆఫర్‌ను అలియాభట్ తిరస్కరించిందని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆంగ్ల దినపత్రికతో మాట్లాడింది. షారుక్ ఆఫర్‌ను తిరస్కరించడం నా ఉద్దేశం కాదు. గౌరీ షిండే డైరెక్షన్‌లో వచ్చిన డియర్ జిందగీ చిత్రంలో అతిధి పాత్రను పోషించడానికి అంగీకారం తెలుపడం చాలా గొప్ప విషయం. షారుక్ వల్ల సినిమాకు ప్లస్ అయింది అని చెప్పింది.

  ఎందుకు తిరస్కరించానంటే..

  ఎందుకు తిరస్కరించానంటే..

  బాలీవుడ్ బాద్షా సినిమా ఆఫర్‌ను ఏ పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని షారుక్‌కు వివరించడానికి అవకాశం కల్పించాలని తన గురువు కరణ్ జోహర్ సలహా తీసుకొందట. కరణ్ సూచన మేరకు షారుక్‌ను ఆయన నివాసమైన మన్నత్‌లో అలియా తన స్నేహితులతోపాటు కలుసుకొంది.

  డేట్స్ లేకపోవడం వల్లే..

  డేట్స్ లేకపోవడం వల్లే..

  తాను సినిమాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. అందుకు రుజువుగా తన డేట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను షారుక్ ముందు పెట్టి ఒప్పించిందట. అంతేకాక తన వద్ద ఉన్న డేట్స్ ప్రకారం వీలైతే నటించడానికి సిద్ధమని చెప్పిందట. వీలుకుదరకపోతే ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానందుకు క్షమించాలని వేడున్నదనేది తాజా సమాచారం.

  అలియా తీరుపై షారుక్ ఇంప్రెస్..

  అలియా తీరుపై షారుక్ ఇంప్రెస్..

  అంతేకాకుండా అలియా చెప్పిన విషయాన్ని క్షణ్ణంగా విన్న షారుక్.. ఆమె ప్రవర్తన తీరుపై ముచ్చట పడినట్టు సమాచారం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆందోళన చెందవద్దని సలహా ఇచ్చినట్టు తెలిసింది.

  ప్రభాస్‌తో నటించడానికి..

  ప్రభాస్‌తో నటించడానికి..

  ఇదిలా పక్కన పడితే.. బాహుబలి హీరో ప్రభాస్‌తో నటించే అవకాశం కోసం పడిచస్తున్నదట. అంతేకాక అవకాశం వస్తే బాగుంటుంది అని ఆశతో ఎదురుచూస్తున్నదనే మీడియాలో తాజా కబురు.

  ప్రభాస్ నా ఫేవరేట్ యాక్టర్..

  ప్రభాస్ నా ఫేవరేట్ యాక్టర్..

  ఒకవేళ ప్రభాస్ నుంచి ఆఫర్ వస్తే అంగీకరించానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. ప్రభాస్ నా ఫెవరేట్ యాక్టర్. ఆయన అంటే చాలా ఇష్టం. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోను అని అలియాభట్ చెప్పింది.

  బాలీవుడ్‌లో హాట్ టాపిక్..

  బాలీవుడ్‌లో హాట్ టాపిక్..

  అయితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఆఫర్ తిరస్కరించిన అలియాభట్ ఒకవేళ ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే ఎలా చేస్తుందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే నిజంగా అంగీకరిస్తుందా అనేది ప్రస్తుతం సినీవర్గాల్లో జరుగుతున్న చర్చలో ప్రధాన అంశంగా మారింది.

  బాలీవుడ్ హీరోయిన్ల వేటలో సాహో నిర్మాతలు..

  బాలీవుడ్ హీరోయిన్ల వేటలో సాహో నిర్మాతలు..

  బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించే సాహో చిత్రం కోసం నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్ల వేటలో ఉన్నారు. శ్రద్ధాకపూర్, దిశాపటానీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వారిని పక్కనపెట్టినట్టు తెలుస్తున్నది. అయితే తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది. అనుష్కను ఎంపిక చేసినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

  English summary
  Reports suggest taht Bollywood actress Alia Bhatt was approached for Shah Rukh Khan-Anand L Rai's film and while, we were all expecting Alia to say 'yes' to this project, the young diva left us shocked by rejecting SRK's project. The other side of story reflects the desperateness of Alia Bhatt to work with Baahubali fame Prabhas. Read on to know in detail..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more