థాంక్యూ రాజమౌళి సర్ అంటూ అలియా భట్ ట్వీట్.. 1000 కోట్లు దాటేసిన బిజినెస్!
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న అన్ని అనుమానాలకు తెరదించారు. గురువారం ఉందయం నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రంపై ఆసక్తిని పెంచే విషయాలని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రలో ఎవరికీ తెలియని అంశాన్ని కల్పిత గాధగా చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సీతారామరాజుగా రాంచరణ్, కొమరం బీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ కు హీరోయిన్ గా రాజమౌళి ఓ విదేశీ హీరోయిన్ పేరు ప్రకటించారు. ఆమె పేరు డైసీ ఎడ్గర్ జోన్స్. తాజాగా రాజమౌళికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.

తొలి తెలుగు చిత్రం
అలియా భట్ నటించబోతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. రాంచరణ్ కు హీరోయిన్ గా 400 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కుతున్న రాజమౌళి చిత్రంలో అలియా అవకాశం దక్కించుకోవడం విశేషం. చాలా రోజులుగా అలియా భట్ తో ఆర్ఆర్ఆర్ టీం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు అలియా భట్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అలియా భట్ గురించిన ఈ వార్త బాలీవుడ్ లో కూడా చర్చనీయాంసంగా మారింది.
థాంక్యూ రాజమౌళి సర్
రాజమౌళి అలియా భట్ గురించి అధికారింగా ప్రకటన చేయగానే.. ఈ బాలీవుడ్ బ్యూటీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అద్భుతమైన టీంతో ఈ జర్నీని ప్రారంభించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా. థాంక్యూ రాజమౌళి సర్ ఎంతటి భారీ చిత్రంలో నాకు అవకాశం కల్పించినందుకు అని అలియా భట్ ట్వీట్ చేసింది. అలియా భట్ ట్వీట్ కు రాజమౌళి కూడా స్పందించారు.

పోటీపడి ఎదుగుతూ
రాజమౌళి అలియా భట్ గురించి ట్వీట్ చేస్తూ.. నీ గురించి చాలా వింటున్నా. నీ తోటి నటులతో పోటీపడి ఎదుగుతున్నావు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నీ పెర్ఫామెన్స్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రాజమౌళి తెలిపాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సరసన విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేసుకున్నారు. ఎడ్గర్ జోన్స్ ఇండియన్ సినిమా అభిమానులకు అంతగా పరిచయం లేని నటి.

1000 కోట్ల బిజినెస్
ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియా భట్ నటిస్తున్న ఇతర చిత్రాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. కళంక్ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలసి బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా అలియా భట్ నటిస్తోంది. ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న చిత్రాల బిజినెస్ 1000 కోట్ల పైమాటే అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











