»   » హలో..! డైరెక్టర్‌ కూతురు సెక్సీఫోజులు!(ఫోటోలు)

హలో..! డైరెక్టర్‌ కూతురు సెక్సీఫోజులు!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రస్తుతం సినీ రంగంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసత్వ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ కూతురు అలియా భట్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గతేడాది వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన అలియా భట్ తొలి సినిమాతోనే బోలెడు గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సినిమా తర్వాత ఫ్యాషన్ షోలు, మేగజైన కవర్ పేజీల కోసం సెక్సీగా ఫోటో షూట్లు అంటూ హడావుడి చేయడం మొదలు పెట్టింది. స్టార్ డైరెక్టర్ కూతురు కావడంతో అవకాశాలు కూడా అమ్మడుకి కలిసి వచ్చాయి. అఫ్ కోర్స్ టాలెంటు కూడా ఉందనుకోండి.

ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా సెక్సీగా చిట్టిపొట్టి డ్రెస్లులు వేస్తూ యువతరం చూపులు తన హాట్ హాట్ అందాలపై పడేలా చేసుకుంటోంది. కురచ దుస్తులే వేసిఈ చిన్నది అదరగొడుతుండటంతో ఫోటో గ్రాఫర్లు ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఆమె ఎక్కడికైనా వస్తుందంటే... ముందుగే వెళ్లి పడిగాపులు పడుతున్నారు.

హలో మేగజైన్ కోసం..

హలో మేగజైన్ కోసం..


తాజాగా అలియా భట్ ‘హలో!' మేగజైన్ కోసం సెక్సీగా తన అందాలను ఆరబసింది. అమ్మడు వయసు తక్కువైనా బాగా అనుభవమున్న భామలా ఫోటో షూట్ కోసం తన హావ భావాలను ప్రకటించడం గమనార్హం.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్


అలియా భట్ కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. కరణ్ జోహార్.. ధర్మా ప్రొడక్షన్, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లపై తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అక్టోబర్ 19న విడుదలయ్యింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రం పెద్దగా ఆడయక పోయినా... స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు కావడంతో అలియా భట్‌కు మరిన్ని అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఆమె ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘హైవే' చిత్రంలో, అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘2 స్టేట్స్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ‘హమ్‌ప్తీ శర్మ దుల్హనియా' చిత్రంలో కూడా నటించబోతోంది.

హైవే

హైవే


హైవే చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ తనకంటే వయసులో చాలా పెద్దవాడైన రణదీప్ హుడాతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది.

2 స్టేట్స్

2 స్టేట్స్


2 స్టేట్స్ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియా వాలా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Alia Bhatt Hello Magazine September 2013 Photoshoot. Alia Bhatt plays the perfect after-party ingenue for this glam shoot in our September issue. Check our behind the scenes coverage of her striking a pose at the Four Seasons, Mumbai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu