వోగ్ మేగజైన్‌పై అలియా భట్ అందాల ఆరబోత (ఫోటోలు)
ముంబై: స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్....అతని కాలంలోనే హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్...చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది.
సినిమాల్లో ఇలాంటి వన్నీ చేసి పేరు పబ్లిసిటీ, పాపులారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే....మేగజైన్ల కవర్ పేజీల కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోవడం మరో ఎత్తు. బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఎదిగిన భామలంతా మేగజైన్ల ఫోటో షూట్ల ద్వారా అదనపు పబ్లిసిటీ సంపాదించిన వారు.
టాప్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో అలియా భట్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది. తాజాగా వోగ్ మేగజైన్ జులై 2014 సంచిక కోసం సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

వోగ్ కవర్ పేజీపై అలియా
ప్రస్తుతం ‘హమ్టీ శర్మాన్ కి దుల్హనియా' షూటింగులో బిజీగా ఉన్న అలియా భట్ వోగ్ కవర్ పేజీ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసి ‘ఇట్స్ ఎ వోగ్ థింగ్' అని పేర్కొంది.

హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం
అందరూ అలియా భట్ ను క్యూట్ గర్ల్ క్యూట్ గర్ల్ అని పిలుస్తుంటే ఆమెకు అస్సలు నచ్చడం లేదు. తాను క్యూట్ గర్ల్ కాదు...హాట్ గర్ల్ అని ఈ ఫోటోల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

అలియా భట్ బ్లాక్ అండ్ వైట్
వోగ్ మగేజైన్‌పై అలియా భట్ కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ లుక్.

వామ్మో..ఏంటీ లుక్!
క్యూట్ గా ఉండే అలియా భట్ ఇలా తయారైందేంటని అనుకుంటున్నారా. వోగ్ మేగజైన్ కోసం ఇచ్చిన వివిధ ఫోజుల్లో ఇదీ ఒక ఫోజే....వెరైటీ కోసమే ఇదంతా.

అలియా భట్ లుక్ అదిరింది
వోగ్ మేగజైన్‌పై అలియా భట్ ఇలా హాట్ లుక్‌లో కనిపించడం ఎంతో బాగుందని...ఈ లుక్‌లో ఆమె మరింత అందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలియా భట్ ఎంట్రీ..
2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది అలియా భట్. తొలి చిత్రంతో పెర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు అందుకుంది.

హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో....
తొలి చిత్రంలో కాస్త పద్దతిగా నటించినా....ఆ తర్వాత వచ్చిన హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో తన గ్లామర్ విశ్వరూపం చూపించింది అలియా. ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా...
ప్రస్తుతం అలియా భట్ ‘హమ్టీ శర్మా కి దుల్హనియా' చిత్రంలో నటిస్తోంది. శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వరుణ్ ధావన్ హీరో.


Click it and Unblock the Notifications











