Alia Bhatt ప్రైవేట్ లైఫ్ ఫోటోలు లీక్.. దొంగచాటుగా జీవితాన్ని బజారుపాలు చేస్తారా? జాన్వీ ఆగ్రహం

సినీ తారలను ఫోటో జర్నలిస్టులు దొంగచాటుగా వెంటాడి ఫోటోలు తీయడం అనేక సందర్బాల్లో వివాదంగా మారాయి. ఎయిర్‌పోర్టులు, జిమ్, ప్రైవేట్ పార్టీలు ఇలా.. పలు సందర్భాల్లో తారల ఫోటోలు బహిర్గతం కావడం, వాటిపై దుమారం జరగడం తెలిసిందే. అయితే తాజాగా అలియా భట్ తన ఇంట్లో టెర్రస్‌పై ప్రైవేట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోటోలు తీయడం వివాదంగా మారింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు మీడియాలో రావడంపై ఆలియా భట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ స్టాటస్ ద్వారా తెలియజేస్తూ భగ్గుమన్నది. అయితే ఆలియా పోస్టుపై జాన్వీ కపూర్ స్పందించింది. ఆలియా, జాన్వీ ఏమన్నారనే విషయాల్లోకి వెళితే..

ఇంటి టెర్రస్‌పై ఉంటే..

ఇంటి టెర్రస్‌పై ఉంటే..

నా ఇంటి టెర్రస్‌పై నేను నా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. పక్క బిల్డింగ్ మీద నుంచి ఇద్దరు నన్ను టార్గెట్ చేయడం చూశాను. వెంటనే నేను అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అప్పటికే తీసిన ఫోటోలు మీడియాలో ప్రచురించారు. నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి ప్రచురించడం ఆ మీడియా సంస్థకు అలవాటుగా మారింది. గతంలో కూడా ఇలాంటి పనులు ఆ మీడియా సంస్థ చేసింది. ఇలాంటి పనులు చేయడం దారుణం అంటూ ఆలియాభట్ తన పోస్టులో తెలిపింది.

జిమ్ వర్కవుట్ ఫోటోలు కూడా

జిమ్ వర్కవుట్ ఫోటోలు కూడా


తనకు తెలియకుండా ఫోటోలు తీసిన మరో ఘటనపై ఆలియాభట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇదే మీడియా సంస్థ తన జిమ్ వర్కవుట్ ఫోటోలు పబ్లిష్ చేసింది. నేను జిమ్‌లో వర్కువుట్స్ చేస్తుంటే.. గాజు అద్దాల వెనుక నుంచి నా ఫోటోలు తీసి ప్రచురించారు. నా ప్రైవేట్ జీవితాన్ని బహిర్గతం చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారు. నా అనుమతి లేకుండా నా ఫోటోలు తీయడం సరికాదు అంటూ ఆలియాభట్ ఆగ్రహం వ్యక్తం చేశారు

చాలా సార్లు రిక్వెస్ట్ చేశా..

చాలా సార్లు రిక్వెస్ట్ చేశా..


ఆలియాభట్ పోస్టుపై జాన్వీకపూర్ స్పందిస్తూ.. ఫోటోగ్రాఫర్లు ఇలాంటి పనులు చేయడం చాలా దారుణం. నాకు కూడా ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. నేను ఫోటోగ్రాఫర్లను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. నాకు తెలియకుండా ఫోటోలు తీయవద్దని చెప్పాను. అలా బతిమిలాడినా వాళ్లు నా ఫోటోలు నాకు తెలియకుండా చూసి వారి మీడియాలో పబ్లిష్ చేశారు. ఇలాంటి దారుణాలు సరికాదు. మాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా అని జాన్వీ తన పోస్టులో తెలిపారు.

నా జిమ్ ఫోటోలు కూడా

నా జిమ్ ఫోటోలు కూడా


యాక్టర్ల ఫోటోలు తీయడం ఫోటోగ్రాఫర్ల పని. కానీ దానికి ఓ హద్దు కూడా ఉంటుంది. నేను జిమ్‌లో ఉండగా నా ఫోటోలు కూడా తీసి మీడియాలో పెట్టారు. యాక్టర్లు, ఫోటోగ్రాఫర్ల మధ్య అవగాహన ఉండాలి. పబ్లిక్ ఫిగర్ అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మాకు ఫోటోగ్రాఫర్ల డ్యూటీ ఎలా ఉంటుందో.. కానీ ప్రజా జీవితంలో ఉన్న వారి పరిస్థితిని కూడా అర్ధం చేసుకోవాలి కదా అని జాన్వీ కపూర్ అన్నారు.

 ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం

ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం

ఆలియాభట్, జాన్వీ చేసిన పోస్టులపై బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అనుష్క శర్మ, కరణ్ జోహర్, అర్జున్ కపూర్, షహీన్ భట్ తదితరులు ఘాటుగా స్పందించారు. సినీ తారల ప్రైవేట్ లైఫ్ గురించిన విషయాలకు దూరంగా ఉండాలి. వారి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయవద్దు అంటూ పలువురు సినీ ప్రముఖులు సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X