»   »  హీరోయిన్ రాయల్ వెకేషన్: ఫలక్‌నుమా ప్యాలెస్ లో (ఫోటోస్)

హీరోయిన్ రాయల్ వెకేషన్: ఫలక్‌నుమా ప్యాలెస్ లో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ లోని ఫలుక్‌నుమా ప్యాలెస్‌ ఇండియాలో చాలా ఫేమస్. ప్రస్తుతం తాజ్ హోటల్స్ గ్రూఫ్ దీన్ని స్టార్ హోటల్‌గా మార్చేంది. ఇంకేం....దేశ విదేశాల్లోని డబ్బున్న మారాజులు, సినిమా స్టార్లు నిజాం కాలం నాటి ఈ విలాసవంతమైన ప్యాలెస్ లో గడిపేందుకు పోటీ పడుతున్నారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం కూడా ఈ ప్యాలెస్ లోనే అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు పెట్టారు.

తాజాగా బాలీవుడ్ కుర్ర బ్యూటీ అలియా భట్...తన ఫ్యామిలీతో కలిసి ఈ హోటల్‌కి వచ్చేసింది. ఇటీవల షూటింగులో చిన్నపాటి గాయం కావడంతో షూటింగుకు సెలవు పెట్టిన అలియా భట్ ఫ్యామిలీతో కలిసి ఈ హోటల్ లో దిగి పోయింది. తండ్రి మహేష్ భట్, సిస్టర్ షాహీన్ తో కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వాలిపోయింది.

ఫ్యాలెస్ ఎంతో అద్భుతంగా ఉందని, ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బావున్నాయని అలియా భట్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఇక్కడి ఫోటోలను కూడా తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. మరి ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

మహేష్ భట్

మహేష్ భట్


ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రముఖ ఫిల్మ్ మేకర్, అలియా భట్ తండ్రి మహేష్ బట్ మెడిటేషన్ చేస్తూ ఇలా...

సోదరితో కలిసి..

సోదరితో కలిసి..


ఫలక్ నుమా ప్యాలెస్ లోని స్విమ్మింగ్ ఫూల్ వద్ద సోదరి షాహీన్‌తో కలిసి సెల్పీ తీసుకుంటున్న అలియా భట్.

గాయం

గాయం


ఇటీవల అలియా భట్ షూటింగులో గాయ పడింది. చేతికి ఇలా కట్టుకట్టుకునే అలియా భట్ ఇక్కడికి వచ్చేసింది.

స్పెషల్ మెను

స్పెషల్ మెను


భట్ ఫ్యామిలీ కోసం తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వారు ప్రత్యేకమైన మెను తయారు చేసారు.

ల్యాండ్ స్కేప్

ల్యాండ్ స్కేప్


ఫలక్ నుమా ప్యాలెస్ లోని ల్యాండ్ స్కేప్ దృశ్యం.

డ్రింక్స్

డ్రింక్స్


ఇక్కడి మెను వివరాలు, బిల్డింగ్ దృశ్యాలు, డ్రింక్స్ ఇలా చాలా ఫోటోలు పోస్టు చేసింది అలియా భట్.

అలియా భట్

అలియా భట్


ప్యాలెస్ లోని వివిధ పురాత వస్తువుల వద్ద అలియా భట్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఫలక్ నుమా ప్యాలెస్

ఫలక్ నుమా ప్యాలెస్


ఒకప్పటి నిజాం రాజ ప్రసాదమైన ఫలక్ నుమా ప్యాలెస్ ఇపుడు లగ్జరీ హోటల్ గా మారిపోయింది.

అద్భుత కట్టడం

అద్భుత కట్టడం


ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎంతో అందంగా, అద్భుతంగా కట్టారు.

మహేష్

మహేష్


చాలా రోజుల తర్వాత మహేష్ భట్ కూతుర్లతో కలిసి ఇలా వెకేషన్ కు వచ్చారు.

English summary
It is vacation time for pretty much every Bollywood celebrity. Alia Bhatt, who is shooting for Udta Punjab and Kapoor & Sons took some time off to spend quality time with Family. The actress who had injured her shoulder was pretty gung ho about the trip and was seen having a great time with the family as well.
Please Wait while comments are loading...