twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ రాత్రిపూట లిప్ట్ అడిగితే...(వీడియో)

    By Srikanya
    |

    ముంబై : మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి అంతా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ పై పడింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ , లక్ష్మీ మంచు తో రామ్ గోపాల్ వర్మ షార్ట్ ఫిల్మ్ లు చేసి వదిలారు. ఇప్పుడు అదే కోవలో బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం క్వీన్ దర్శకుడు వికాశ్ బల్ ఓ షార్ట్ ఫిల్మ్ ని చేసారు. అలియా భట్ ని ప్రధాన పాత్రలో పెట్టి ఆ షార్ట్ ఫిలిం ను రూపొందించారు. ఉమెన్ సేప్టీ థీమ్ మీద ఈ షార్ట్ ఫిలిం నడుస్తుంది.

    కాన్సెప్టు ఏమిటంటే....అలియా భట్‌ ఒంటరిగా కారులో ప్రయాణిస్తోంది. నడిరాత్రివేళ రోడ్డుపై కారు ఆగిపోయింది. ఒక్క నిమిషం అటు ఇటూ చూసింది. ఇంతలోనే ఓ ఐదుగురు అబ్బాయిలు కారులో వస్తూ ఆమెను చూశారు. ఇది గమనించిన ఆమె భయపడలేదు. వాళ్లందరూ ఆమెను కోరుక్కు తినేసేలా చూస్తున్నారు. అయినా ధైర్యంగా వాళ్లని పిలిచి సమస్య చెప్పింది. లిఫ్ట్‌ ఇచ్చారు. హాయిగా ఇంటికి వెళ్లిపోయింది.

    Alia Bhatt’s short film “Going Home”.

    ఇదంతా నిజంగా జరిగింది కాదు. ఓ లఘు చిత్రంలోని సన్నివేశమిది. 'క్వీన్‌' దర్శకుడు వికాస్‌ భల్‌ దీన్ని రూపొందించారు. ఇందులో అలియా నటించింది. ఈ చిత్రం పేరు 'గోయింగ్‌ హోమ్‌'. మహిళారక్షణకు సంబంధించిన కథాంశంతో సాగే ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఆ షార్ట్ ఫిల్మ్ ను ఇక్కడ చూడండి...

    English summary
    Now, in Bollywood QUEEN fame director Vikas Bahl made a short film with Alia Bhatt on women’s safety theme. "I pledge to create a short film titled 'Going Home', in which we visualise a utopia for women, where, unlike today, mistrust and fear don’t dictate actions and decisions,” says director Vikas Bahl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X