»   » పిచ్చిక్కిస్తోంది అనేది చిన్న మాట: ఈ ఫొటోలు చూస్తే అవునంటారు

పిచ్చిక్కిస్తోంది అనేది చిన్న మాట: ఈ ఫొటోలు చూస్తే అవునంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై:'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగేట్రం చేసి.. 'టూ స్టేట్స్'లో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన అలియా భట్. మహేష్‌భట్ తనయురాలిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ... తనంటే ఏమిటో నిరూపించుకొని వారసత్వానికి దీటుగా నిలిచింది. నటనతో పాటు అందాల ప్రదర్శనకూ ప్రయారిటీ ఇచ్చే ఆమె అందాలు చూసినవాళ్లు కళ్లు తిప్పుకోలేరు. ఆమె తాజా చిత్రం ఉడ్తా పంజాబి ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె ఫొటోలు మీడియాకు వచ్చాయి. మీరే చూసి ఎంజాయ్ చేయండి.

  ఈ అందాలకి తోడు ఆమె లవ్ స్టోరీ ఎప్పుడూ బాలీవుడ్ లో హాట్ టాపిక్కే. అసలు ఈ జంట ఏ క్షణంలో ప్రేమలో పడ్డారో కానీ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రేమ ఉన్నచోట అపోహలు, అపార్దాలు కామన్ కానీ మరీ క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎప్పుడూ కొట్టుకుంటూంటూండే జంటను ఏమనాలి. ఖచ్చితంగా వాళ్లని అలియా భట్, సిద్దార్ద్ మల్హోత్రా అనాలి. గత కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు ముదిరి బ్రేకప్ కు రెడీ అయ్యారనే వార్తలు వచ్చాయి.

  అయితే ఎప్పటిలాగే అలియా భట్ వీటిని కేవలం రూమర్స్ అనే కొట్టిపారేస్తోంది. ఆమె తాజా చిత్రం ఉడ్తా పంజాబి ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ..ఈ విషయం ప్రస్దావనకు వచ్చింది. మీ బోయ్ ఫ్రెండ్ తో మీరు గొడవపడి విడిపోయారని వార్తలు వస్తున్నాయంటూ ఓ మీడియా వ్యక్తి అనగానే ఆమె వెంటనే స్పాంటినిటిగా ఫన్నీగా సమాధానమిచ్చి కొట్టిపారేసింది.

  ఆమె ఫొటోలు స్లైడ్ షోలో చూసి ఎంజాయ్ చేయండి..

  పిచ్చిక్కిస్తోంది అనేది చిన్న మాట: ఈ ఫొటోలు చూస్తే అవునంటారు

  పిచ్చిక్కిస్తోంది అనేది చిన్న మాట: ఈ ఫొటోలు చూస్తే అవునంటారు

  బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు అలియా భట్‌ కూడా చేరేందుకు సిద్ధమవుతోంది.

  అయితే..

  అయితే..

  అది ఇప్పుడు కాదు.. తన హోంటౌన్‌ అయిన బాలీవుడ్‌లో ఓ గుర్తింపు తెచ్చుకున్నాకే హాలీవుడ్‌కి సై అంటోంది.

  బెస్ట్ లేదు

  బెస్ట్ లేదు

  ఇప్పటి వరకు వచ్చిన అవకాశాల్లో బెస్ట్‌ అంటూ ఏమీ రాలేదని.. అందుకే హాలీవుడ్‌ గురించి ఆలోచిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఉడ్తా పంజాబ్‌ సినిమాతో బిజీగా ఉంది.

  బయోపిక్

  బయోపిక్

  బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఫర్హాన్‌ అక్తర్‌, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్‌లు బయోపిక్‌లలో నటించి తామేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు అలియా భట్‌కి కూడా ఓ బయోపిక్‌లో నటించాలని ఉందట.

  పాక్ గాయని

  పాక్ గాయని

  అది కూడా ప్రఖ్యాత పాక్‌ గాయని నజియా హసన్‌ పాత్రలో నటించాలని ఉందని, నజియాలాగే తానూ ఓ గాయనే కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపింది.

  షారూఖ్ సరసన

  షారూఖ్ సరసన

  షారుఖ్ తో అలియా బేబీ నటించబోయే సినిమా స్టోరీ సరికొత్తగా ఉండబోతోందని లేటెస్ట్ గా బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  లవ్ స్టోరీనే

  లవ్ స్టోరీనే

  ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా దర్శకురాలు గౌరీ షిండే తెరకెక్కించబోయే "ఎ హట్కే లవ్ స్టోరీ"లో షారుఖ్ సరసన అలియా రొమాన్స్ చేయనుందట.

  వేర్వేరు వ్యక్తులు

  వేర్వేరు వ్యక్తులు

  ఇరవై ఏళ్ల అమ్మాయి... ముగ్గురు వేర్వేరు వయసులో ఉన్న మగాళ్లతో డేటింగ్ చేయడమనే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా భట్ బ్యూటీ కనిపించనుందట.

  ఆ ముగ్గురలో

  ఆ ముగ్గురలో

  ఇక ఆ ముగ్గురు వేర్వేరు మగాళ్లలో ఒకరైన 50 ఏళ్ల వ్యక్తిగా షారుఖ్ ఖాన్ కనిపిస్తాడట. అంటే 20 ఏళ్ల అలియా.. సినిమాలోనూ 50 ఏళ్లు ఉన్న షారుఖ్ తో డేటింగ్ చేస్తుందన్న మాట.

  కాంట్రావర్శినా

  కాంట్రావర్శినా

  స్టోరీ గురించి తెలుసుకున్న కొందరు సినీ జనం... ఇలాంటి స్టోరీ వినడానికి బాగానే ఉన్నా... కమర్షియల్ గా సక్సెస్ అవుతుందా లేక కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటుందా అని చర్చించుకోవడం స్టార్ట్ చేశారట.

  ఆసక్తి కామన్

  ఆసక్తి కామన్

  ఏదేమైనా... 50 సంవత్సరాల వయస్సులో ఉన్న కింగ్ ఖాన్ తో అలియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి అప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది.

  ఇంకో సినిమా

  ఇంకో సినిమా

  'వేక్ అప్ సిద్', 'యే జవానీ హై దివానీ' సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చకున్నాడు అయాన్ ముఖర్జీ. కలకత్తాకి చెందిన ఈ కుర్రాడి దర్శకత్వంలో అలియా ఓ సినిమా చేయనుంది.

  జీనియస్

  జీనియస్

  అయాన్‌తో పనిచేయడంపై అలియా స్పందిస్తూ ''అయాన్ ఓ జీనియస్.. తనదో ప్రత్యేక ప్రపంచం. అతనితో ఎప్పుడెప్పుడు పనిచేస్తానా అని ఎదురు చూస్తున్నా'' అంటూ తన దర్శకుడిని కీర్తించింది.

  సూపర్ మ్యాన్ కు జోడి

  సూపర్ మ్యాన్ కు జోడి

  ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సూపర్‌మేన్‌గా కనపడనున్నాడు. రణబీర్ కు జోడిగా ఆలియా కనిపించనుంది. దర్శకుడిగా అయాన్‌కి ఇది మూడో సినిమా కాగా ఈ మూడు సినిమాల్లోను రణ్‌బీర్ సింగే హీరో.

  నెక్ట్స్ తరం

  నెక్ట్స్ తరం

  రాబోయే తరంలో స్టార్ హీరోయిన్ గా ఖచ్చితంగా అలియాకు చోటు ఉంటుందని బాలీవుడ్ అంచనా వేస్తోంది.

  English summary
  Rumours are doing the rounds, that Alia Bhatt and Sidharth Malhotra are having a rough phase in their relationship and the duo end up fighting most of the time. However, Alia Bhatt, finally spoke out on the rumours about the tiff with her boyfriend, and peppered it with a pinch of humour.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more