Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోను లవ్ చేస్తున్నా: డైరెక్టర్ కూతురు ప్రకటన!
హైదరాబాద్: బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురు అలియా భట్ బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి అలియా పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పబ్లిసిటీ పెంచుకోవడానికి సరికొత్త మార్గాలు అన్వేషిస్తోంది ఈ బ్యూటీ.
తన తాజా సినిమా '2 స్టేట్స్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న అలియా భట్ మాట్లాడుతూ.... హీరో రణబీర్ కపూర్‌ను తాను ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించింది. అయితే తనది వన్ సైడ్ లవ్ మాత్రమే, ఎలాగైనా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానంటోంది.
అలియా భట్ వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ స్టంటే అని, ఇలా వ్యాఖ్యానించడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆటిట్యూడ్ తెలిసిన వారు అంటున్నమాట. అలియా భట్ నటిస్తున్న '2 స్టేట్స్' విషయానికొస్తే యూటీవీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో సాజిద్ నడియావాలా, కరణ్ జోహార ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపత్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2009లో చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈచిత్రాన్ని రూపొందించారు.
ఏప్రిల్ 18, 2014న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్జున్ కపూర్, అలియా భట్‌తో పాటుగా....అమృత సింగ్, రేవతి, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-ఎస్సాన్-లాయ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.