»   » కోపమా..!?, బరితెగింపా..!! మరీ ఇలా మాట్లాడాలా?? "అతనంటే నాకు పిచ్చి, పిల్లల్ని కంటాను..." అలియా భట్

కోపమా..!?, బరితెగింపా..!! మరీ ఇలా మాట్లాడాలా?? "అతనంటే నాకు పిచ్చి, పిల్లల్ని కంటాను..." అలియా భట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించారంటే చాలు వారు ఇక బీ టౌన్ హాట్ కపుల్స్ అయినట్టే. సినిమా షూటింగ్ టైంలో అభిప్రాయాలు నచ్చటంతో వారితో ఓ రేంజ్ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తారు. బాలీవుడ్ లేటెస్ట్ కపుల్స్ అలియా, సిద్ధార్ద్ ల ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు మామూలు జనం లో కూడా హాట్ టాపిక్కే.. ఒక సారి చెట్తాపట్టలేసుకొని కనిపిస్తారు, మళ్ళీ రెండో రోజే బ్రేక్ అప్ అంటారు... వీళ్ళిద్దరూ ఇలా కొట్తుకుంటూనే కొంచం ఇష్టం కొంచం కష్టం టైప్ లో రిలేషన్ సాగిస్తున్నారు.

మొన్నటిదాకా వరుణ్ ధావన్ తో ఓ రేంజ్ రొమాన్స్ చేసిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుదు సిద్ధార్ద్ తో పీకల్లోతు ప్రేమలో ఉందట. సీక్రెట్ గా నడిపిస్తున్న ఈ జంట ప్రేమాయణం ఇంతకుముందు ఇద్దరిని అడిగినా ఏం లేదని బుకాయించారు. కానీ రీసెంట్ గా అలియా ఇంటికి గెస్ట్ గా వెళ్లిన సిద్ధార్ద్ ని అడిగేశారట మీడియా వారు. తప్పుకునే ఛాన్స్ లేని సిద్ధార్ద్ అవును మేము ప్రేమించుకుంటున్నాం అనేశాడు. అంతేకాదు కెరియర్లో మంచి పొజిషన్ వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటామని అన్నాడట. ఈ మ్యాటర్ అంతా చూసిన అలియా సిగ్గుతో తలదించుకుని వెళ్లిందట..

Alia wants to make babies with Sidharth Malhotra

అయితే ఈ న్యూస్ వచ్చీన రెండు రోజులకే బ్రేకప్ అంటూ సంకేతాలిచారు... కొన్నాళ్లనుంచీ మళ్ళీ కలిసి కనిపిస్తున్నారు అసలు ఈ జంట కలిసి ఉందా లేదా అన్నవిషయం అర్థం కాని ఒక విలేకరి కాస్త క్లారిటీ కోసం ఓ ప్రశ్న వేసాడు... దానికి పిచ్చి కోపం తో ఊగిపోయింది బాలివుడ్ చిన్న పిల్ల ఆలియా భట్... సిద్ధార్ధ్ మల్హోత్రా నుంచి మీరు విడిపోయారంటా కథా..? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చి కుండబద్దలు కొట్టింది. ఎవరూ చెప్పారు మేము విడిపోయామని నాకు అతనంటే పిచ్చి. అతనితో ఇద్దరు పిల్లల్ని కూడా మీకేమైనా అభ్యంతరమా?? అంటూ మీడియాపై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రంలో నటిస్తుంది. తన తల్లి సోని రజ్దాన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఇటీవలే సింగపూర్ నుంచి ఇండియాకు వచ్పింది. ఈమె నటించిన ''డియర్ జిందగీ'' చిత్రం నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో 50యేళ్ల షారుక్ ఖాన్‌కు జంటగా నటించింది 23 యేళ్ల అలియా.

English summary
Alia Bhatt made a statement that ascertained her fondness for her rumoured boyfriend Sidharth Malhotra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu