కొత్త ట్యాలెంట్ తో....( 'అలియాస్ జానకి' ప్రివ్యూ)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో 'పంజా' చిత్రం రూపొందించిన నీలిమా తిరుమలశెట్టి నిర్మించిన తదుపరి చిత్రం 'అలియాస్ జానకి' ఈ రోజు విడుద అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి. టాక్ పరంగా ప్రీ రిలీజ్ కు ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.
నిర్మాత మాట్లాడుతూ "పంజా సినిమా తర్వాత ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. కానీ నేను ఈ సినిమా చేయడానికి పవన్‌కల్యాణ్ కారణం. కొత్త ప్రతిభను ప్రోత్సహించమన్నారు. అందుకే ఈ సినిమా చేశాను. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది'' అని అన్నారు.
హీరో మాట్లాడుతూ "అలియాస్ జానకి కథకాదు. ఇన్సిడెంట్‌లా ఉంటుంది. రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా. సాంకేతికంగా అందర్నీ మెప్పిస్తుంది'' అని అన్నారు. వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అలియాస్ జానకి'.
థియేటర్లతో పాటు ఆన్‌లైన్లో విడుదల చేయడం ద్వారా మంచి కలెక్షన్స్ వస్తాయని ఈ చిత్ర నిర్మాత నీలిమ తిరుమలశెట్టి భావిస్తున్నారు. మరో విశేషం ఏమింటే ఆన్‌లైన్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే. zingreel అనే మూవీ పోర్టల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆన్‌లైన్లో ఈ చిత్రాన్ని చూసేందుకు ఒక షోకు $4.99 డాలర్లుగా నిర్ణయించారు. విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పైరసీకి ఆస్కారం లేకుండా ఈ చిత్రాన్ని ఆన్‌లైన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బ్యానర్: సంఘమిత్ర ఆర్ట్స్
నటీనటులు: వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య, నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు ఇతర ముఖ్య తారాగణం.
సంగీతం: శ్రావణ్,
కెమెరా: సుజిత్ సారంగ్,
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్,
ఆర్ట్: హరి వర్మ,
నృత్యాలు: దయా.కె, వంశీ కాట్రోజు,
యాక్షన్: దయా.కె., సుజిత్ సారంగ్,
మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల,
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దయా.కె.,
సహ నిర్మాత: విక్రమ్.ఎస్
సమర్పకుడు: తారా అరుళ్‌రాజ్
నిర్మాత: నీలిమ తిరుమలశెట్టి


Click it and Unblock the Notifications












