బ్రతికుండగానే శ్రద్ధాంజలి.. ఆయన ఫోన్ కోసం వెయిటింగ్.. సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా హీరోహీరోయిన్స్ విషయంలో అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. స్టార్ స్టేటస్ ఖాయం అనుకున్న వాళ్ళు కనుమరుగై పోవడం, ఏదో ఫర్వాలేదులే అనుకున్న వాళ్ళు స్టార్ స్టేటస్ పట్టేయడం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఒకప్పుడు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ రేఖ.. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర సంగతులు చెప్పింది. ఆ వివరాలేంటో చూద్దామా..

 కనులు తెరిచినా కనులు మూసినా.. ఆ హీరోయిన్!

కనులు తెరిచినా కనులు మూసినా.. ఆ హీరోయిన్!

''కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా'' అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది రేఖ. 'ఆనందం' సినిమాలో నటించి, ఈ పాటకు గాను ఆమె చూపిన అభినయం.. హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే ముద్రించుకొని ఉన్నాయి.

ఆలీతో సరదాగా రేఖ.. రూమర్స్‌పై స్పందన

ఆలీతో సరదాగా రేఖ.. రూమర్స్‌పై స్పందన

15 ఏళ్ల క్రితం అలా 'ఆనందం'గా అలరించిన రేఖ వెండితెరకు దూరమైపోయింది.తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ కావడంతో క్రమంగా ఈమె పేరును మరచిపోయారు ఆడియన్స్. అంతేకాదు ఒకానొక సమయంలో రేఖ మరణించిందనే వార్తలు కూడా షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సర్‌ప్రైజ్ చేసిన రేఖ.. తనకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పింది.

బతికుండగానే శ్రద్ధాంజలి.. గ్రేట్ ఛాన్స్

బతికుండగానే శ్రద్ధాంజలి.. గ్రేట్ ఛాన్స్

కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్న రేఖ.. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి అంటూ సరదాగా స్పందించింది. అంతేకాదు అప్పటినుంచి తాను ఎవరింటికన్నా పోతే.. తిరిగి వెళ్లిపోయేటప్పుడు న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతానని చెప్పింది. ఆ పేపర్‌లో తన మరణ వార్త గురించి చూసి అంతా షాక్ అయ్యేలా చేస్తానని పేర్కొంది.

ఆయన ఫోన్ కోసం వెయిటింగ్.. పెళ్లి కూడా చేసుకోలేదు

ఆయన ఫోన్ కోసం వెయిటింగ్.. పెళ్లి కూడా చేసుకోలేదు

ఇక తాను నాగార్జున హీరోగా రూపొందిన 'మన్మథుడు'లో గెస్ట్ రోల్ చేసానని, అది కేవలం నాగార్జున గారి కోసమే చేసానని చెప్పింది రేఖ. అయితే ఆ తర్వాత ఆయన
తనతో కలిసి మరో సినిమా చేద్దామన్నారు కానీ.. ఇప్పటివరకు ఫోన్ చేయలేదని చెప్పింది. ''నాగార్జున గారూ మీ ఫోన్ కోసం వెయిటింగ్ ఇక్కడ. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. మంచి అబ్బాయి కోసం వెయిటింగ్'' అని చెప్పింది రేఖ.

Recommended Video

Actress Latha Sri Reveals Interesting Facts In Ali's Show || Filmibeat Telugu

విచ్చలవిడిగా తిరిగేలా చేస్తా.. షాకింగ్ ఆన్సర్

సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో.. ‘నువ్వు సీఎం అయితే ఏం చేస్తావ్' అని రేఖను ప్రశ్నించాడు ఆలీ. దీనిపై స్పందించిన ఈ హీరోయిన్.. ‘నేను సీఎం అయితే పార్కుల్లో అందరూ విచ్చలవిడిగా తిరిగేలా చేస్తాను' అని చెప్పి షాకివ్వడం విశేషం. ఆమె సమాధానం విని ఆలీతో సహా అంత ఆశ్చర్యపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X