అనుష్క ప్రేమాయణం నిజాలు
సినిమా రంగంలో అర్ధం పర్ధం లేని వదంతులు వస్తుంటాయి. ఇప్పుడు అనుష్క చుట్టూ అన్నీ పుకార్లే. అనుష్క తాజాగా 'పెళ్లిళ్ల పేరమ్మ" అవతారం ఎత్తింది. నిజ జీవితంలో అనుష్క పోషించిన ఈ పాత్ర వల్ల కొన్ని వదంతులు సైతం పుట్టుకొచ్చాయి. ప్రముఖ యువ ఛాయాగ్రహకుడు సెంథిల్ కుమార్ తో అనుష్క ఎఫైర్ నడుపుతోందంటూ ఆమధ్య కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు రావడం తెలిసిందే! అనుష్క నటించగా అసాధారణ విజయం సాధించిన 'అరుంధతి" చిత్రానికి ఛాయాగ్రహణమందించింది సెంథిలే కావడం ఈ వదంతులకు ఊతమిచ్చింది. కానీ, నిజానికి జరిగిందేమిటంటె, సెంథిల్ జీవితభాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో అనుష్క ముఖ్యపాత్ర పోషించింది. అనుష్క స్నేహితురాలినే సెంథిల్ ప్రేమించడంతో..ఆ ప్రేమ, పెళ్లి వరకూ వెళ్ళడంలో అనుష్క కీలక పాత్ర వహించింది. దాంతో అనుష్క-సెంథిల్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ రూమర్స్ వ్యాపించాయి.
anushka love affair senthil kumar arundhati web sites senthil partner అనుష్క అరుంధతి సెంథిల్ కుమార్


Click it and Unblock the Notifications