డబ్బు, డబ్బు, డబ్బు- ఆ హీరోయిన్
డబ్బు విషయంలో శ్రియ మహా మొండి అని, ఆమెకు అడ్వాన్సు ఇస్తే మంచి కారణాల వల్ల అయినా వెనక్కి తీసుకోవడం అసాధ్యమని ఒక టాక్ విన్పిస్తోంది. 'శివాజీ" చిత్రంతో అమాంతం ఆకాశానికి ఎదిగిపోయిన ఢిల్లీ భామ శ్రీయకు తమిళ పరిశ్రమ బ్రహ్మరథం పడుతోంది. ఆ చిత్రం తరువాత హాలీవుడ్ చిత్రంలో అవకాశం రావడమే కాకుండా తమిళ్‌లో స్టార్ హీరోల చిత్రాల్లో కథానాయికగా అనేక చిత్రాల్లో ఆఫర్లు అంది పుచ్చుకుంటోంది. ప్రస్తుతం విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'మల్లన్న" లోను, విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 'పిస్తా" చిత్రంలోనూ ఇంకా ధనుష్, ఆర్య చిత్రాల్లో కథానాయికగా నటిస్తూ తమిళ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది.
shriya shivaji delhi hollywood rajini kanth vikram mallanna vishal pista శ్రియ శివాజీ హాలీవుడ్ విక్రమ్


Click it and Unblock the Notifications