పులి జడుసుకొన్నది, ఖలేజా ఖతం అయింది..మరి బృందావనం....!?
ఇటీవల విడుదలైన 'పులి", నిన్న విడుదలైన 'ఖలేజా" ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ఎన్టీఆర్ పైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'బృందావనం"అక్టోబర్ 14వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా కనుక ఘన విజయం సొంతం చేసుకుంటే జూ ఎన్టీఆర్ కి తిరుగులేదని చిత్ర పరిశ్రమ అంటోంది. దానికి కారణం 'అదుర్స్".ఈ యేడాది జనవరిలో విడుదలైన 'అదుర్స్" విజయం సాధించడమే. ఇప్పుడు 'బృందావనం" కూడ సక్సెస్ సాధిస్తే ఒకే యేడాది ఎన్టీఆర్ రెండు హిట్లు ఇచ్చినట్టు అవుతుంది. నేటితరం హీరోల్లో ఒక యేడాదికి రెండు సినిమాలు చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది ఏకంగా రెండు హిట్లు ఇస్తే ఆ పరంగా ఎన్టీఆర్ రికార్డు సాధించినట్టేనని చెప్పొచ్చు..
జూ ఎన్టీఆర్ మహేష్ బాబు ఖలేజా పులి పవన్ కళ్యాణ్ బృందావనం అదుర్స్ jr ntr mahesh babu khaleja puli pawan kalyan brindavanam


Click it and Unblock the Notifications