»   » నువ్వే దేవుడివి సామీ.... పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ సెటైర్!

నువ్వే దేవుడివి సామీ.... పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ సెటైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సెటైరిక్ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఎప్పుడూ దేవుడు అనే నమ్ముతాను. తిరుమల బాలాజీ, యాదగిరి గుట్ట నరసింహ స్వామి, భద్రాచలం రాముడు.... లాంటి దేవుళ్లను పవన్ కళ్యాణ్ తో రీప్లేస్ చేస్తే బావుంటుంది అంటూ ట్వీట్ చేసారు.

ఇటీవల జరిగిన 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పలువురు పవన్ కళ్యాణ్ భజన చేసిన నేపథ్యంలో వర్మ ఇలాంటి ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. పవన్ కు సన్నిహితంగా ఉండే నిర్మాత బండ్ల గణేష్ మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

నాకు మొక్కలంటే ప్రేమ

రామ్ గోపాల్ వర్మ పోస్టు చేసిన ఈ ట్వీట్ మరింత వెటకారంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎండిపోతున్న గులాబీని నిమిరాడు వెంటనే కొమ్మకు కొత్త జీవం వచ్చింది. ఆయన కరువు ప్రాంతంలో అడుగు పెట్టగానే నీళ్లు పుష్కలంగా పడ్డాయి అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేసారు.

సందర్భం కోసం వేచి చూసే వర్మ

సందర్భం కోసం వేచి చూసే వర్మ

రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా వర్మ తనదైన రీతిలో వ్యంగాస్త్రాలు సంధిస్తూనే ఉంటాడు. ఈ మధ్య మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ మీద వర్మ వరుస ట్వీట్లు సంధిస్తూనే ఉన్నాడు.

బాహుబలితో లింకు పెట్టి మెగా ఫ్యామిలీపై

ఇటీవల విడుదలైన ‘బాహుబలి-2' ట్రైలర్‌ను విపరీతంగా ప్రశంసిన వర్మ, మరోసారి మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, సూపర్‌స్టార్‌లను కించపరిచాడు. ప్రభాస్‌ కాలిగోటికి సరిపోవాలంటే వీరికి రెండున్నర జన్మలు పడుతుందని ఎద్దేవా చేశాడు. బాహుబలి-2' ట్రైలర్‌కి ప్రపంచమంతా జై కొడుతున్నా, టాలీవుడ్‌ మాత్రం సూపర్‌ సైలెంట్‌గా ఉండిపోయిందని, దానికి కారణం టాలీవుడ్‌.. కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని విమర్శించాడు.

వర్మకు ఎందుకు ఇంత కసి


‘టాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ స్టార్లు నేషనల్‌గా ట్రై చేసి ఘోరంగా ఫెయిల్‌ అయ్యి రీజనల్‌ అయిపోయారు. ప్రభాస్‌ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు' అని మరో ట్వీట్‌ చేశాడు.

English summary
"I always believed he's God and I truly think Balaji,yadagirigutta swamy,Bhadrachalam Ramudu etc Gods should be replaced with P K" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu