»   »  మెగా ఫ్యాన్స్ మీటింగ్: మూడు ప్రధాన సమస్యలపై చర్చ...

మెగా ఫ్యాన్స్ మీటింగ్: మూడు ప్రధాన సమస్యలపై చర్చ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఆలిండియా మోగా ఫ్యాన్స్' ఇటీవల హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ముందుగా గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అభిమానులు అల్లు అరవింద్‌ను కలిసిన అనంతరం స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కార్యాలయంలో మెగాబ్రదర్ నాగబాబుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలను ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా మూడు సమస్యలపై అభిమానులు చర్చించారు. చిరంజీవి 150వ సినిమా, ఇటీవల దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు, మెగా కుటుంబంలో విబేధాలు ఉన్నాయంటూ బయట ప్రచారం జరుగుతుందనే అంశాలపై అభిమానులు ప్రధానంగా చర్చించారు.

'All India Mega Fans' meeting details

ఈ సదర్భంగా చిరు, పవన్ అభిమానులం అంతా ఒకటేనని, విభేదాలు లేవని ప్రకటించారు. ఇటీవల సినిమా ఫంక్షన్‌లో దాసరి నారాయణరావు చేసిన కామెంట్లపై మెగా కుటుంబం స్పందించలేదని, వాటిని ఖండించలేదని ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల అభిప్రాయాలు విన్న నాగబాబు స్పందిస్తూ...చిరంజీవి, పవన్, చరణ్‌లు తొందరలో ఒకే వేదికపైకి తెస్తానని నాగబాబు ఫాన్స్‌కి హామీ ఇచ్చారు. చిరంజీవి 150వ సినిమా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందనే వాదన మీటింగ్ అనంతరం అభిమానుల నుండి వినపడింది.

దాసరి చేసిన కామెంట్లను అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ దాసరి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాసరి వర్గానికి...చిరు వర్గం మధ్య చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో దాసరి డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్లు చేసినా... ఎప్పుడూ స్పందించలేదు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు మాత్రం తీవ్రంగా పరిగణిస్తుంది.

English summary
The other day it happens to be meet of 'All India Mega Fans' with Mega Brother Nagababu and quite a surprising things have come out there. Initially fans have rushed to Geetha Arts office to meet Allu Arvind and later they ended up meeting with Nagababu at State Gallery Of Fine Arts.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu