23న దేశ వ్యాప్తంగా సినిమా బంద్?
ఈ నెల 23న దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ బంద్ పాటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బంద్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాల షూటింగులు నిలుపుదల చేయడంతో పాటు, థియేటర్లు బంద్ పాటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలపై పన్ను భారం మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో 'ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' బంద్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే వివిధ సమస్యలు మరియు రాబడి నష్టాలు కారణంగా తీవ్ర ఎదురుదెబ్బలు ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో సర్వీస్ టాక్స్ విధిస్తే నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి.కె వెల్లడించారు.
ఇప్పటికే సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయాలనే యోచనలో ఉంది. అయితే ఇప్పటి వరకు పవర్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గ్రిడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఈబంద్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











