క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బాలకృష్ణ
హైదరాబాద్: అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం బాలకృష్ణ తననివాసంలో ఆవిష్కరించారు. బాలకృష్ణ అభిమానులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.10వేలు విరాళం అందజేశారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత సంవత్సరం హిట్ అనేది లేకుండా గడిపిన బాలకృష్ణ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రాన్ని వీడు తేడాతో దర్శకుడుగా మారిన చిన్ని కృష్ణ డైరక్ట్ చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గతంలో సునీల్ తో ఈ చిత్ర దర్శకుడు చిత్రం అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ ..బాలకృష్ణకు ఈ కథ వినిపించి ఒప్పించినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ కూడా కథ విని వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఓ పెద్ద హీరోయిన్ ని ఈ చిత్రం కోసం అడుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అఫీషియల్ గా ప్రకటించే అవకాసం ఉంది. ' సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు...సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు... అంటూ 'కొత్త బంగారులోకం' చిత్రంలో, 'ఇట్స్ నాట్ ఎ వాటర్ డ్రింకు స్లోలీ.. అంటూ 'అదుర్స్' చిత్రంలో తనదైన డైలాగ్ డెలివరీతో నటుడిగా ఆకట్టుకున్న చిన్నికృష్ణ 'వీడు తేడా' చిత్రంతో దర్శకుడిగా మారాడు. నిఖిల్ పూజా బోస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కళ్యాణ్ చక్రవర్తి, సందీప్ నిర్మించారు. ఆ మద్యన విడుదలైన ఈ చిత్రం దర్శకుడుగా మంచి పేరునే తెచ్చిపెట్టింది.

Click it and Unblock the Notifications












