కాజల్, మెహ్రీన్ మధ్య ఏం జరిగింది.. కవచం షూటింగ్‌లో విభేదాలు, అందుకే ఇలా!

అందాల చందమామ కాజల్ సౌత్‌లో స్టార్ హీరోయిన్. దక్షణాది బడా హీరోలందరితో కాజల్ అగర్వాల్ నటించింది. ఇప్పటికి కాజల్ క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇక యంగ్ బ్యూటీ మెహ్రీన్ కూడా మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. వీరిద్దరూ కలసి బెల్లంకొండ శ్రీనివాస్ కవచం చిత్రంలో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో పోలీస్ అధికారికంగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.

కాజల్, మెహ్రీన్ గ్లామర్

కాజల్, మెహ్రీన్ గ్లామర్

కవచం చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్నాడు. బెల్లంకొండా శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రంలో కాజల్, మెహ్రీన్ గ్లామర్ ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కానీ కాజల్, మెహ్రీన్ మధ్య మనస్పర్థలు రేగాయని ఓ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. షూటింగ్ దశలో తలెత్తిన విభేదాల వలన వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట.

మెహ్రీన్ దూరంగా

మెహ్రీన్ దూరంగా

కాజల్, మెహ్రీన్ మధ్య తలెత్తిన విభేదాల వలనే ఆడియో లాంచ్ కు మెహ్రీన్ హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఇష్టపడడం లేదట. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు దుబాయ్ లో చిత్రికరించారు. ఆ సమయంలో మెహ్రీన్ తో కలసి వెళ్ళడానికి కాజల్ నిరాకరించిందట. కానీ నిర్మాతలు కాజల్ ని బుజ్జగించి పంపినట్లు తెలుస్తోంది.

పుకార్లకు తెరదించుతూ

ఈ ప్రచారం ఎక్కువవుతుండడంతో కాజల్, మెహ్రీన్ జాగ్రత్తపడ్డారో ఏమో తెలియదు కానీ పుకార్లకు తెరదించేలా మెహ్రీన్, కాజల్ సోషల్ మీడియాలో స్పందించారు. వీరిద్దరి మధ్య చాలా సరదాగా ట్విట్టర్‌లో సంభాషణ జరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తప్ప వీరిద్దరూ కలసి కనిపించక పోవడంతో ఈ అనుమానాలు చెలరేగాయి.

సరైన విజయం కోసం

సరైన విజయం కోసం

ఇక హీరో విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ డాన్సులు, నటన పరంగా మంచి మార్కులు దక్కించుకుంటున్నాడు. కానీ అతడి చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించడం లేదు. కవచం చిత్రం ఆ లోటు భర్తీ చేస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X