»   » అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున తనపై వస్తున్న రూమర్స్ తో హర్ట్ అయ్యాడు. వెంటనే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అక్కినేని నాగార్జున తన పేరు మీద, అన్నపూర్ణ స్టూడియోస్ మీద పలు బ్యాంకుల వద్ద చాలా అప్పులు తీసుకున్నాడని, వాటిని కట్టకుండా ఎగ్గొట్టాడంటూ ప్రచారం మొదలైంది.

దీనిపై నాగార్జున వివరణ ఇచ్చారు. బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి అప్పులు ఎగ్గొట్ట లేదని, అన్నీ కట్టేసానని, తాము అప్పులు ఎగ్గొట్టామంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని... వారందరికీ ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.

అప్పులు తీసుకున్న మాట నిజమే

అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్ధి కోసం ఇంతకు ముందు బ్యాంకుల నుంచి కొంత అప్పు తీసుకున్న మాట నిజమే, ఈ ఏడాది ప్రారంభంలోనే వాటన్నిటినీ చెల్లించేశామని నాగార్జున ట్విట్టర్లో స్పష్టం చేసారు.

ఎవరి బకాయి పడలేదు

బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి బకాయిలు పడలేదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు.

ఈ ప్రచారం వెనక కారణం ఏమిటి?

ఈ ప్రచారం వెనక కారణం ఏమిటి?

అన్నపూర్ణ స్టూడియోస్ డెవలప్‌మెంటు కోసం నాగార్జున అప్పు తీసుకున్నారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో బ్యాంక్ వారు నోటీసులు కూడా పంపారని, సీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయంటే ఆ మధ్య వార్తలు వచ్చాయి.

మరి అప్పులు ఎలా కట్టాడు?

మరి అప్పులు ఎలా కట్టాడు?

మాటీవీలో నాగార్జునకు కూడా వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మాటీవీ అమ్మేసారు.... ఈ డీల్ ద్వారా భారీగానే డబ్బు ముట్టిందని, అలా వచ్చిన డబ్బుతో నాగార్జున అప్పులన్నీ తీర్చేసారని అంటున్నారు. ఏది ఏమైనా నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ ఎవరికీ ఎలాంటి బకాయిలు పడలేదనేది స్పష్టమవుతోంది.

English summary
"It is true we took a loan frm banks to build new film facilities at annapurna studios earlier.ALL LOANS HAVE BEEN CLEARED EARLIER THIS YEAR. For the few who may believe so neither me nor annapurna studios owe any money to any banks!!FYI" Nagarjuna tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu