»   » ఆ స్టార్ హీరో మీద పేలుతున్న కుళ్లు జోకులు!

ఆ స్టార్ హీరో మీద పేలుతున్న కుళ్లు జోకులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ నటించిన 'రోబో' చిత్రం 2010లో విడుదలైనప్పటి నుంచి ఆయనపై జోకులు బాగా ప్రచారంలోకి వచ్చాయి. అవి ఇంటర్నెట్లో, సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతూ హ్యాస్యప్రియులను తెగ నవ్విస్తున్నాయి. ఈ సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్‌పై మానవ మాత్రుడికి అసాధ్యమైనవన్నీ అవలీలగా సుసాధ్యం చేస్తుంటాడు. ఆ కారణంగానే ఈ జోకులు ప్రచారంలోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఆ మధ్య మన తెలుగులో ఓ అగ్రహీరోపై జోకులు బాగా ప్రాచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి ఇప్పుడు రజనీకాంత్‌పై కూడా ఈ జోకులను సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ రూపంలో స్నేహితులకు షేర్ చేస్తూ తెగ ఎంజాచేస్తున్నారు. ఏజ్ తేడా లేకుండా అందరూ ఈ జోకులకు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అయితే ఈ జోకులు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే....అంతేకానీ ఇందులో ఎలాంటి దురుద్దేశము, లేదా కించపరిచి అవమానించే ధోరణి అసలు లేనేలేదు. అందుకే రజనీకాంత్ అభిమానులు సైతం వీటిని చదివి ఎంజాయ్ చేస్తున్నారు.

స్లైడ్ షోలో రజనీకాంత్‌కు సంబంధించిన జోకులు చదివి మీరూ నవ్వుకోండి.

రజనీకాంత్‌పై జోకులు

రజనీకాంత్‌పై జోకులు

-మాగ్నెటిక్ కంపాస్ కొన ఎప్పుడూ నార్త్ వైపే ఎందుకు చూపిస్తుందో తెలుసా...? రజనీకాంత్ ఉండేది సౌత్‌లో కనుక. అతని వైపు వేలెత్తి చూపే దమ్ము ఎవరికీ లేదు కాబట్టి.
-రజనీకాంత్ ప్రపంచ వంటల పోటీకి వెళ్లాడు. అతనే విజయం సాధించాడనుకోండి. అతను అక్కడ వండిన వంటకం ఏమిటో తెలుసా...ఎర్రమిరపకాయలతో చేసిన తియ్యటి పాయసం
-రజనీకాంత్ అరటి తొక్కమీద కాలేస్తే....పడిపోయేది రజనీకాంత్ కాదు, భూమే స్లిప్ అయి జారికింద పడిపోతుంది.
- వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రజనీకాంత్ క్రికెట్ టీం 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ విజయం సాధించింది.

రజనీకాంత్‌పై జోకులు

రజనీకాంత్‌పై జోకులు

-టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ ఇలాంటిది మొదట ఉపయోగించింది నేనే అనుకున్నాడు...కానీ అప్పటికే రజనీకాంత్ నుంచి రెండు మిస్డ్ కాల్స్ రావడం చూసి రియలైజ్ అయ్యాడు.
-రజనీకాంత్ తుమ్మడం వల్లనే 26 డిసెంబర్, 2004న భారీ సునామీ వచ్చింది.
-కేవలం రజనీకాంత్ మాత్రమే ఆకాశంలోని నక్షత్రాలను కచ్చితంగా లెక్కపెట్టగలరు.
-యాపిల్ పండు చెట్టుపై నుంచి కిందపడటం వల్లనే న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతం కనిపెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి దాన్ని విసిరింది రజనీకాంతే..
-ఈమెయిల్ పూణె నుంచి ముంబైకి పంపబడింది. కానీ రజనీకాంత్ దాన్ని లోనావాలా అనే ప్రాంతంలో అడ్డుకున్నాడు

రజనీకాంత్‌పై జోకులు

రజనీకాంత్‌పై జోకులు

-స్టార్ల విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో ఉంటే...మేడమ్ టుస్సాడ్స్ విగ్రహమే రజనీకాంత్ ఇంట్లో ఉంది.
-బూస్ట్ యొక్క ఎనర్జీ సీక్రెట్ రజనీకాంతే, కాంప్లాన్ ఈజ్ ద రజనీకాంత్ బాయ్
-రజనీకాంత్ 5 డిఫరెంట్ బాషల్లో విజిల్ వేయగలడు తెలుసా..!
-మోనాలిసా పేయింటింగ్ నవ్వువెనక రహస్యం కేవలం రజనీకాంత్‌కు మాత్రమే తెలుసు
-2012లో ప్రపంచం అంతం కాకపోవడానికి కారణం.....మూడు సంవత్సరాల వారంటీ ఉన్న లాలీపాప్ రజనీకాంత్ కొనటం వల్లనే!

రజనీకాంత్‌పై జోకులు

రజనీకాంత్‌పై జోకులు

-రజనీకాంత్ పల్స్ రిక్టర్ స్కేలుపై మాత్రమే కొలవగలం
-కొత్తగా వచ్చిన రూపాయి సింబల్ నిజానికి రజనీకాంత్ సంతకం
-రజనీకాంత్ 100 మీ. పరుగులో పాల్గొన్నాడు. అందరికంటే ఫస్ట్ వచ్చాడు. కానీ అతని వేగం చూసి ఐన్‌స్టీన్ షాకయ్యాడు. కారణం కాంతి వేగంలో రజనీ కంటే వెనక రెండో స్థానంలో నిలవడమే.
-రజనీకాంత్‌కు సర్జరీ చేయాలంటే....డాక్టర్లకు, ఎక్విప్‌మెంట్ల్స్‌కి అనెస్తీషియా ఇవ్వాల్సిందే.

రజనీకాంత్‌పై జోకులు

రజనీకాంత్‌పై జోకులు

- రజనీకాంత్ పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులను బ్లూటూత్ ద్వారా చంపేసాడు
-రజనీకాంత్ కంపాస్‌తో స్ట్రెయిట్ లైన్ గీయగలడు
-ఓసారి రైతు తన పొలంలో రజనీకాంత్ దిష్టిబొమ్మను పెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? గత సంవత్సరం ఎత్తుకెళ్లిన గింజలను కూడా పక్షులు తిరిగి తీసుకొచ్చి ఆ పొలంలో పడేసాయి.
-ఒక రజనీకాంత్‌కు మాత్రమే 32 జ్ఞాన దంతాలు ఉంటాయి.
-సూర్యుడిని కాపాడటానికి రజనీకాంత్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు.
-రజనీకాంత్ ఈ మెయిల్ అడ్రస్ gmail@rajinikanth.com

English summary
Jokes on Rajinikanth became very popular during the release of his magnum opus Endhiran - The Robot in 2010.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu