Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా పోతుందన్నారు, లాభాలు తెచ్చేసింది : పీఎస్వీ గరుడవేగ 2 స్క్రిప్ట్ కూడా సిద్దం
అసలు ఏమాత్రం మార్కెట్ లేని రాజశేఖర్‌తో పాతిక కోట్ల బడ్జెట్ తో సినిమా తీసిన ప్రవీణ్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమా రీచబిలిటీని బట్టి ఈ కథను కొనసాగించేలా ముందే ప్లాన్ చేసుకున్నాడట
చాలా నెగెటివ్ కామెంట్స్, ఇంకా మరింత నిరాశ పరిచే ప్రీ రిలీజ్ బిజినెస్, అసలు ఇప్పుడు రాజశేఖర్ కు పెద్దగా మార్కెట్ లేదు. తను ఇతర వేషాలకు మారిపోక తప్పదని రాజశేఖర్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయి ఆఖరికి విలన్ గా కూడా చేస్తానని సిద్దమైనన పరిస్థితులలో వచ్చిన మూవీ గరుడవేగ. టీజర్.. ట్రైలర్ లతో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం.. స్థానికంగానే కాదు.. యూఎస్ లో కూడా అదరగొడుతోంది.
Recommended Video
పీఎస్వీ గరుడవేగ
రాజశేఖర్ గరుడవేగ మూవీకి యూఎస్‌లో అద్భుతమైన పికప్ లభించింది. గురువారం నాడు ప్రీమియర్లతో 28వేల డాలర్లు రాబట్టగా.. శుక్రవారం నాడు 64వేల డాలర్లకు వసూళ్లు పెరిగాయి. శనివారం నాడు అయితే ఏకంగా 106వేల డాలర్లు రావడం విశేషం. సండే కూడా జోరు చూపించిన ఈ చిత్రం 60వేల డాలర్లను రాబట్టి.. మొత్తంగా వసూళ్లను 2.62 లక్షల డాలర్లకు పెంచుకుంది.
పెట్టుబడి రికవర్
ఇప్పటికే దాదాపుగా పెట్టుబడి రికవర్ చేసేయగా.. ఇకపై కూడా కొన్ని రోజుల పాటు జోరు చూపించి.. లాభాలను పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం ఆఫర్స్ ను పక్కాగా ఉపయోగించుకునే అవకాశం గరుడవేగకు దక్కింది. తెలుగు రాష్ట్రాల సంగతేమో కానీ.. యుఎస్‌లో మాత్రం ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే
అక్కడ ఈ సినిమా ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లు సమాచారం. నిజానికి పెద్దగా అంచనాలు లేని ‘గరుడవేగ' సినిమా యుఎస్ హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. ఆ మొత్తం రూ.36 లక్షలని సమాచారం. ఐతే యుఎస్ తెలుగు ప్రేక్షకులు మెచ్చే క్లాస్ థ్రిల్లర్ కావడం.. టాక్ కూడా ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో అక్కడ అంచనాల్ని మించి వసూళ్లు వచ్చాయి.
పాతిక కోట్ల బడ్జెట్
అసలు ఏమాత్రం మార్కెట్ లేని రాజశేఖర్‌తో పాతిక కోట్ల బడ్జెట్ తో సినిమా తీసిన ప్రవీణ్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమా రీచబిలిటీని బట్టి ఈ కథను కొనసాగించేలా ముందే ప్లాన్ చేసుకున్నాడట ప్రవీణ్ సత్తారు. ఇంకా పక్కా క్లారిటీ లేదుగానీ ఈ న్యూస్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.
గరుడవేగ-2
ఇప్పుడు గరుడవేగ-2 అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు.కథ ఇప్పటికే రెడీ అవ్వగా దీనికి సంబంధించి వెంటనే ప్రయత్నం మొదలు పెట్టాలని చూస్తున్నాడట. సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అవడంతో ఈసారి సీక్వల్ లో మరింత టెక్నికల్ ఎఫర్ట్స్ తో సినిమా తీస్తారని అంటున్నారు.