ఆరోజు ఉంటాది అసలైన రచ్చ..: రంగస్థలంపై కొత్త అప్ డేట్!
రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రంగస్థలం' ప్రీ-రిలీజ్ వేడుకులకు అంతా సిద్దమైంది. మార్చి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశాఖ సాగరతీరంలో ఈ వేడుక జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానుండటం విశేషం.

అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, వైజాగ్ చిరంజీవి యువత అధ్యక్షుడు పీతల గోవింద్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు బుధవారం వైజాగ్ లోని ఓ హోటల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రీ-రిలీజ్ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారని చెప్పారు.
ramcharan tej ramcharan rangasthalam 1985 rangasthalam sukumar vizag chiranjeevi samantha akkineni రాంచరణ్ తేజ్ రాంచరణ్ చిరంజీవి సుకుమార్ రంగస్థలం సమంత వైజాగ్ ప్రీరిలీజ్


Click it and Unblock the Notifications