ఆశ్చర్యం... మెగా హీరోలందరిదీ ఈ రోజే నుంచే
కాకతాలీయంగా, ఆశ్చర్య కరంగా మెగా కుటుంబంలోని టాప్ హీరోల సినిమాలన్నీ ఈ రోజే నుంచి కొత్త షెడ్యూల్ లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో మెగా అభిమానులంతా సందడిగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హారిష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బండ్ల గణేష్ నిర్మాత. హిందీ దబాంగ్ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు నుంచే కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' చిత్రంలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజునుంచే ఫ్రెష్ షెడ్యూల్ లోకి ఎంటర్ అవుతోంది. ఈ చిత్రానికి పరాస్ జైన్, ఎన్.వి. ప్రసాద్ నిర్మాతలు. మరో వైపు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రవిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కూడా ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన నటిస్తుండగా డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











