twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబా.. మజాకా: ‘మహర్షి’ టీజర్ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన నటించిన 'మహర్షి' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వ్యూస్ పరంగా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపారేసింది.

    'మహర్షి' టీజర్ విడుదలైన 12 గంటల్లోపే 10 మిలియన్ వ్యూస్ సాధించింది. గతంలో మహేష్ నటించిన 'భరత్ అనే నేను' మూవీ టీజర్ 24 గంటల్లో 9.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా.. ఆ రికార్డును 'మహర్షి' కేవలం 12 గంటల్లోనే బీట్ చేసింది.

    <strong>మహర్షి టీజర్: 'ఓడిపోతాను అంటే గెలిచి చూపించడం అలవాటు'.. మహేష్ డైలాగ్ కేక!</strong>మహర్షి టీజర్: 'ఓడిపోతాను అంటే గెలిచి చూపించడం అలవాటు'.. మహేష్ డైలాగ్ కేక!

    ఫాస్టెస్ట్ 10 మిలియన్ టీజర్‌గా ఆల్ టైమ్ రికార్డ్

    ఫాస్టెస్ట్ 10 మిలియన్ టీజర్‌గా ఆల్ టైమ్ రికార్డ్

    కేవలం యూట్యూబ్‌లోనే 10 మిలియన్ సాధించడం, అది కూడా కేవలం 12 గంటల్లోనే అత్యంత వేగంగా సాధించడంతో ‘మహర్షి' టీజర్ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది. టీజరే ఇలా ఉందంటే రేపు సినిమా థియేటర్లో క్రియేట్ చేసే రికార్డులు ఎలా ఉండబోతున్నాయో? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

    నిమిషాలు గడుస్తున్న కొద్దీ..

    నిమిషాలు గడుస్తున్న కొద్దీ..

    టీజర్ విడుదలైన 24 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా... 60 నిమిషాల్లో 2 మిలియన్ క్రాస్ అయింది. 160 నిమిషాల వద్ద 3 మిలియన్, 220 నిమిషాల తర్వాత 4 మిలియన్, 310 నిమిషాల తర్వాత 5 మిలియన్, 410 నిమిషాల తర్వాత 6 మిలియన్, 497 నిమిషాల తర్వాత 7 మిలియన్, 590 నిమిషాల తర్వాత 8 మిలియన్, 694 నిమిషాల తర్వాత 9 మిలియన్, 780 నిమిషాల్లో 10 మిలియన్ మార్క్ రీచ్ అయింది.

    24 గంటల్లో 12.6 మిలియన్ వ్యూస్

    మహర్షి టీజర్ 24 గంటల్లో 12.6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను పక్కకు నెట్టేసింది.

    వంశీ పైడిపల్లి టేకింగ్ కేక

    వంశీ పైడిపల్లి టేకింగ్ కేక

    టీజర్లో మహేష్ బాబు స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ థ్రిల్లవుతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో తెరకెక్కించారో టీజర్లనే స్పష్టం అవుతోంది. అతడి టేకింగ్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

    మహర్షి

    మహర్షి

    ‘మహర్షి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    English summary
    Superstar Mahesh Babu is back with a bang to shatter all the existing records of Telugu cinema. On the eve of Ugadi, the teaser of his next film Maharshi has been out and it shattered all the existing records of Tollywood. The teaser clocked 10 million views on YouTube alone in less than 12 hours which is a new record. Earlier, Mahesh Babu's Bharat Ane Nenu teaser clocked 9.1 million views in 24 hours and Maharshi crossed it by miles in just 12 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X