Just In
- 29 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
Don't Miss!
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆల్ టైం టాప్-10 తెలుగు సినిమా డైలాగులు
హైదరాబాద్: సినిమాలు వస్తుంటాయ్ పోతుంటాయ్. ఎంత మంచి సినిమా అయినా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాల్లోని పాటలు, డైలాగులు, మ్యానరిజం లాంటివి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ప్రేక్షకుల్లో నాటకు పోతాయి. కొన్ని డైలాగులు పరిస్థితులకు అనుగుణంగా ప్రజల నోళ్లలో నానుతూ ఉంటాయి. ఇలా ఆడియన్స్ మదిలో చిరస్థాయిగా నిలిచి పోయిన టాప్ 10 డైలాగులపై ఈ రోజు ఫోటో ఫీచర్లో ఓ లుక్కేద్దాం.

పోకిరిలో మహేష్ బాబు డైలాగులు
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు.

రెబల్ చిత్రంలో ప్రభాస్ డైలాగులు
మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు...ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, నేను రెండేళ్ల ఉపవాసం తరువాత వేటాడే పులిని. ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చిన రెబల్.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్
నాకు కొంచెం తిక్కుంది...దానికి ఓ లెక్కుంది.

బిజినెస్ మేన్ లో మహేష్ బాబు
నీ టార్గెట్ 10 మైళ్లు అయితే...టార్గెట్ 11వ మైలు అయి ఉండాలి.

జులాయిలో అల్లు అర్జున్
చెప్పాలి సార్...ఆఫ్ట్రాల్ సిగరెట్ పాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారు అని రాసి ఉన్నపుడు...నాలాంటోడు నన్ను గెలకొద్దు చస్తారు అని చెప్పకపోతే ఎలా?

బాలకృష్ణ సింహా
చూడు...ఒక వైపే చూడూ...రెండో వైపు చూడాలనుకోకు...తట్టుకోలేవ్...మాడిపోతావ్.

మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ
అరిస్తే తరుస్తా...తరిస్తే కరుస్తా...కరిస్తే నిన్ను కూడా బొక్కలో ఏస్తా కబడ్దార్.

ప్రభాస్ మిర్చి
కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ వాడలేరు.

రామ్ చరణ్ మగధీర
ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్...ఒకేసారి వంద మందిని పంపు. లెక్క ఎక్కువైనా ఫర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో...

చిరంజీవి ఇంద్ర
ఒరేయ్ వీర శంకర్ రెడ్డి....మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా....