»   » బాహుబలి రాకతో... టాలీవుడ్ టాప్ 10 లిస్టు తారుమారు!

బాహుబలి రాకతో... టాలీవుడ్ టాప్ 10 లిస్టు తారుమారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ 10 లిస్టులో ఉన్న సినిమాలు..... బాహుబలి విడుదలై తర్వాత తారుమారు కాబోతున్నాయి. నెం.1 స్థానంలో బాహుబలి సినిమా నిలవబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే. బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బాహుబలి నెం.1 స్థానంలో నిలవడం ఖాయం అనేది ట్రేడ్ విశ్లేషకుల మాట.

బాహుబలి సినిమా 250 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా విడుదలవుతోంది. తొలి భాగం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్లలో తెలుగు, హిందీ, తమిళం, మళయాలం బాష్లలో విడుదలవుతోంది. సినిమా విడుదలైన రెండు వారాల్లోపే సినిమా 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించి టాప్ 10లో నిలిచిన సినిమాల లిస్టును పరిశీలిద్దాం.


అత్తారింటికి దారేది
  

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రూ. 74.88 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా ఉంది. బాహుబలి తర్వాత ఇది రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.


మగధీర
  

మగధీర

మగధీర సినిమా రూ. 73. 6 కోట్లు సాధించి ఇపుడు రెండో స్థానంలో ఉంది. అత్తారింటికి దారేది రాక ముందు ఇదే నెం.1, బాహుబలి తర్వాత ఇది నెం.3కి వెళ్లే అవకాశం ఉంది.


గబ్బర్ సింగ్
  

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ 60.55 కోట్ల షేర్ సాధించి ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ఇది నాలుగో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


రేసు గుర్రం
  

రేసు గుర్రం

రేసుగుర్రం చిత్రం 57.65 కోట్ల షేర్ సాధించి ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది....బాహుబలి తర్వాత 5వ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


దూకుడు
  

దూకుడు

దూకుడు మూవీ 56.7 కోట్ల షేర్ సాధించి ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ఇది 6వ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ 51 కోట్ల షేర్ సాధించి 6వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత 7వ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


సన్నాఫ్ సత్యమూర్తి
  

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం 50.75 కోట్ల షేర్ సాధించి 7వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ఇది 8వ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


మిర్చి
  

మిర్చి


ప్రభాస్ నటించిన మిర్చి చిత్రం 47.45 కోట్ల షేర్ తో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ఇది 9వ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది.


ఎవడు
  

ఎవడు

రామ్ చరణ్ ఎవడు చిత్రం 47.1 కోట్ల షేర్ సాధించి ప్రస్తుతం 9 వస్థానంలో ఉంది. బాహుబలి తర్వాత 10 వ స్థానంలో ఉండే అవకాశం ఉంది.


బాద్ షా
  

బాద్ షా

బాద్ షా చిత్రం 47 కోట్ల షేర్ సాధించి 10వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత టాప్ 10 లిస్టులో ఇది ఉండే అవకాశం లేదు.


Please Wait while comments are loading...